
● సాక్షి కథనాన్ని పోస్ట్ చేసిన కేటీఆర్
బోయినపల్లి(చొప్పదండి):‘తాతయ్య జోగినిపల్లి కేశవరావు, లక్షల మంది స్వాతంత్య్ర యోధుల పోరాటంపై గర్వపడుతున్నాను. వాళ్లు చేసిన త్యాగాలతోనే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ.’ అని మంత్రి కేటీఆర్ సోషల్‌ర మీడియాలో పోస్టు చేశారు. ‘తిరగబడ్డ పోరుగడ్డ’ శీర్షికతో ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన కథనాన్ని మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మా తాతయ్యతోపాటు లక్షలాది మంది సమరయోధుల పాత్ర కూడా ఉంది, ఇలాంటి పోరాటాల్లో మా తాతయ్య ఉండడం మాకు గర్వకారణం... అని పేర్కొన్నారు.
షుగర్ వ్యాధిని
ముందే గుర్తిస్తే మేలు
● అర్బన్ బ్యాంకు చైర్మన్ నారాయణ
సిరిసిల్ల: షుగర్(మధుమేహం) వ్యాధిని ముందే గుర్తించి వైద్యం చేయించుకుంటే మేలు జరుగుతుందని సిరిసిల్ల అర్బన్ బ్యాంకు చైర్మన్ గాజుల నారాయణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం లయన్స్ ప్రతినిధులు ఉచిత షుగర్ వ్యాధి పరీక్షల శిబిరం నిర్వహించారు. గాజుల నారాయణ మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధి వస్తుందని, ముందుచూపుతో పరీక్షలు చేసుకుని మందులు వాడితే ఎలాంటి ఇబ్బంది పండదన్నారు. పోత్గల్ ఏఎంసీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బూట్ల నవీన్, రజక సంఘం పట్టణాధ్యక్షుడు దండు శ్రీనివాస్, వాకర్స్ ప్రతినిధులు వాసం శ్రీనివాస్, జిందం రమేశ్, ఏనుగుల ప్రభాకర్, దర్శనాల కిష్టస్వామి, ఇట్టబోయిన వెంకటేశ్, లయన్స క్లబ్ అధ్యక్షుడు నగునూరి శ్రీకాంత్, కార్యదర్శి బచ్చు భానుచందర్, డాక్టర్ దోర్నాల శ్యాంసుందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎక్స్‌లో కేటీఆర్ చేసిన పోస్టు