
రావయ్యా.. గణపయ్యా
ఆది దంపతుల ప్రియసుతుడు, సర్వ విఘ్నాలు తొలగించే గణనాథుడు భూలోకంలో భక్తుల కోరికలు తీర్చేందుకు విచ్చేస్తున్నాడు. ఆయనకు స్వాగతం పలికేలా మంటపాలను మామిడితోరణాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈసారి మట్టిగణపతినే పూజించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడేలా తనను మట్టిరూపంలో కొలిచేందుకు సిద్ధమైన భక్తుల కోరికలు తీర్చాలన్న ఆకాంక్షతో వినాయకుడు మరికొద్ది గంటల్లోనే భువిపైకి చేరనున్నాడు. ఈ సాయంత్రం నుంచి నవరాత్రులపాటు ఘనమైన పూజలందుకోనున్నాడు. తీరొక్క ఫలహారం.. ఉండ్రాళ్ల నైవేద్యం.. భజనలు తదితర ప్రత్యేక కార్యక్రమాలతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మికశోభ సంతరించుకోనుంది. వినాయక చవితి విశిష్టత.. పూజావిశేషాలతో ప్రత్యేక కథనం..
7
సోమవారం శ్రీ 18 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2023
– వివరాలు 8లోu
న్యూస్‌రీల్



