చోరీ కేసుల ఛేదన | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసుల ఛేదన

Jul 23 2026 12:36 AM | Updated on Jul 23 2026 12:36 AM

దర్శి: దర్శి సర్కిల్‌ పరిధిలో పెండింగ్‌లో ఉన్న దొంగతనం కేసును ఛేదించి నిందితురాలిని అదుపులోనికి తీసుకొని ఆమె వద్ద నుంచి రూ.16 లక్షల విలువైన 128 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు దర్శి డీఎస్పీ పి.బాలమురళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితురాలు చెన్నంశెట్టి సుమలత పట్టణంలోని పుట్టా బజారులో నివాసముంటోంది. గత ఏడాది సెప్టెంబర్‌ 3న సుమలత ఆమె పుట్టింటి నుంచి త్రిపురాంతకం మీదగా బస్సులో దర్శికి తన కుమార్తెతో ప్రయాణిస్తుండగా ఓ లగేజ్‌ బ్యాగులో హ్యాండ్‌ పర్సులో బంగారం ఆభరణాలును ఉంచింది. ఇంటికి వెళ్లి బ్యాగును పరిశీలించడగా బంగారం ఉన్న హ్యాండ్‌ బ్యాగ్‌ కనబడలేదు. ఈ మేరకు దర్శి టౌన్‌ పోలీసు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దర్శిలోని అద్దంకి రోడ్లో సంస్కృతి స్కూల్‌ సమీపంలో సాతుపాటి కుమారిని అదుపులోనికి తీసుకొని విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించింది. ఆమె వద్ద నుంచి 128 గ్రాముల బంగారు ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితురాలిపై గతంలో కూడా పలు దొంగతనం కేసులు నమోదయ్యాయి. నిందితురాలిని దర్శి న్యాయస్థానం ముందు హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన సీసీఎస్‌ సీఐ కమలాకర్‌, దర్శి సీఐ వై రామారావు, దర్శి ఎస్సై ఏడుకొండలు, పోలీస్‌ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

బల్లికురవలో..

బల్లికురవ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తుతో బుధవారం సంతమాగులూరు మండలం బల్లికురవ బస్టాండ్‌ సెంటర్‌ వద్ద ఇద్దరు అనుమానితులను అదుపులోనికి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. నిందితులు సంతమాగులూరు, మార్టూరు, జె.పంగులూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పలు దొంగతనాలు చేశారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరిలో ఒకరు మార్టూరులోని జనార్దన్‌ కాలనీకి చెందిన మెలికా నాగరాజు, ఎన్టీఆర్‌ జిల్లా(ప్రస్తుతం మార్టూరులో నివాసం) ఇబ్రహీం పట్నంకు చెందిన పాలపర్తి రాజేష్‌గా గుర్తింనట్లు వివరించారు. వీరు ఇద్దరు ఆర్థిక ఇబ్బందులతో దుర్వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 5న సంతమాగులూరులో బాలాజీ స్కూల్‌ సమీపంలోని ఇంటిలో చోరీ చేసి రెండు జతల బంగారు కమ్మలు అపహరించారు. ఇదే నెల 30వ తేదీన జె.పంగులూరు మండలం ముప్పవరంలో, జూలై 13న మార్టూరు మండలం ద్రోణాదులలో చోరీలు చేశారు. ఈ నెల 16 న ఇసుక దర్శి – వలపర్ల గ్రామాల మధ్య పొలాల నుంచి మూడు నీటి మోటార్లు దొంగిలించినట్లు విచారణలో నిందితులు ఒప్పుకున్నట్లు డీఎస్పీ వివరించారు. సంతమాగులూరు కేసులో దొంగిలించిన రెండు జతల బంగారు కమ్మలను నరసరావుపేటలో విక్రయించగా వచ్చిన రూ.60,000/ నగదును నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సంతమాగులూరు సీఐ శేషగిరిరావు, బల్లికురవ ఎస్సై నాగరాజు సిబ్బంది పాల్గొన్నారు.

చోరీ కేసులో

నిందితుడు అరెస్టు

అద్దంకి: పట్టణంలోని కాకానిపాలెంలో ఇటీవల వృద్ధురాలిపై దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసు వివరాలను దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ గురువారం విలేకర్లకు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..పట్టణంలోని కాకానిపాలెంలో ఈ నెల 5వ తేదీన ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిపై దాడి చేసి ఆమె మెడలోని బంగారు చైన్‌, చేతికి ఉన్న బంగారు గాజులు కలిపి ఐదు సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో బల్లికురవ మండలం కొమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన లావు వంశీకృష్ణ చోరీకి పాల్పడినట్లు గుర్తించి నిందితున్ని మండలంలోని తిమ్మాయపాలెంలో అదుపులోనికి తీసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. కేసును ఛేదించిన సీఐ సుబ్బరాజు బృందాన్ని డీఎస్పీ అభినందించారు.

భారీగా బంగారు ఆభరణాలు రికవరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement