ఆర్‌ఆర్‌ ప్యాకేజీ అందరికీ అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌ ప్యాకేజీ అందరికీ అమలు చేయాలి

Jul 23 2026 12:36 AM | Updated on Jul 23 2026 12:36 AM

సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రఫి

మార్కాపురం:

వెలిగొండ నిర్వాసితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీని ప్రభుత్వం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీకేఎం రఫీ డిమాండ్‌ చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో మూడో రోజు బుధవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంతో గ్రామాలను ఖాళీ చేసేందుకు సిద్ధపడిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వాలు పెద్దమనసుతో వ్యవహరించాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు 18 సంవత్సరాల నిండిన వారందరికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దీక్షల్లో పాల్గొన్న యువకులకు పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్వాసితుల సంఘం కో కన్వీనర్లు దగ్గుపాటి సోమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మ బాల నాగయ్య, పి.రూబేను, సీఐటీయూ పట్టణ కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కే విజయ్‌ కుమార్‌, డీ వందన్‌ కుమార్‌ నిర్వాసితుల సంఘం కార్యకర్తలు బొల్లవరం మల్లికార్జున, మండ్ల అనిల్‌, మద్దూరి శశీంద్ర, పానుగంటి రంగ సాయిలు, పసుపులేటి శ్రీనివాసులు, నాలి ప్రసాద్‌, బుర్రి వెంకటేశ్వర్లు, కుందూరు అంజిరెడ్డి, కొర్రపోలు దేవ సహాయం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement