ప్లాస్టిక్‌ వ్యర్థాల గోడౌన్‌ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ వ్యర్థాల గోడౌన్‌ దగ్ధం

May 29 2026 2:37 AM | Updated on May 29 2026 2:37 AM

రూ.30 లక్షల ఆస్తి నష్టం

నాగులుప్పలపాడు:

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్లాస్టిక్‌ వ్యర్థాల గోడౌన్‌ దగ్ధమై రూ.30 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ సంఘటన నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు పఠాన్‌ ఇమ్రాన్‌ బాషా ఆ గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాల సమీపంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల రీసైక్లింగ్‌ యూనిట్‌ నడుపుతున్నాడు. బుధవారం కూడా కూలీలు పనిచేసి సాయంత్రం ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత మిషననరీ వద్ద ఉన్న విద్యుత్‌ వైర్లు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు వ్యాపించాయి. మిషన్లతో పాటు గోడౌన్‌ మొత్తం పూర్తిగా కాలిపోయింది. స్థానికులు గమనించి వెంటనే ఫైర్‌స్టేషన్‌కు ఫోన్‌ చేశారు. వారు వచ్చేలోపే గోడౌన్‌తో పాటు అందులోని మిషన్లు, సరుకు మొత్తం మంటల్లో కాలిపోయిందని బాధితుడు ఇమ్రాన్‌ తెలిపారు. రూ.30 లక్షల విలువైన మిషనరీ, సరుకు కాలిపోయినట్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వైఎస్సార్‌ సీపీ నాయకుల పరిశీలన...

ఘటన స్థలాన్ని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు నలమలపు కృష్ణారెడ్డి, తదితర నాయకులు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఇమ్రాన్‌కు ధైర్యం చెప్పారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున దృష్టికి తీసుకెళ్లి ఇమ్రాన్‌కు అండగా ఉంటామని కృష్ణారెడ్డి తెలిపారు. పరిశీలించిన వారిలో పార్టీ మేధావుల సంఘ రాష్ట్ర కార్యదర్శి కంచర్ల సుధాకర్‌, గ్రీవెన్స్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పోలినేని కోటేశ్వరరావు, దివ్యాంగుల విభాగం రాష్ట్ర కార్యదర్శి కాట్రగడ్డ శ్రీనివాసరావు, మండల ఉపాధ్యక్షుడు కాటూరి ఆదియ్య, ఎంపీటీసీ పొద పవన్‌, మాజీ సర్పంచ్‌ ఘట్టమనేని అశోక్‌, గ్రామాధ్యక్షుడు కట్టా రాజా, టింకు, తోకల శ్రీను, యడవల్లి మోహనరావు, అత్తి, జబ్బార్‌, బాపట్ల సాయి తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement