ఎండ దెబ్బకు తాళలేక, కొనుగోలుదారులు రాక ఒంగోలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిలిచిన తోపుడు బండ్లు
దేవుడా.. ఏమి ఎండ..
రోహిణి కార్తె ప్రారంభం నుంచే భానుడు భగభగ
మండుతున్నాడు. రహదారులు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. వేడి గాలులు వీస్తుండటంతో జనం ఇళ్లకు పరిమితం అవుతుండగా.. బేరాలు లేక వ్యాపారులు విలవిల్లాడుతున్నారు. ఎండ దెబ్బకు తట్టుకోలేక చిరువ్యాపారులు దుకాణాలు, తోపుడు బండ్లు మూత వేసి ఇంటి బాట పడుతున్న దృశ్యాలు ఒంగోలు నగరమంతా కనిపిస్తున్నాయి. హీట్ వేవ్‌పై వాతావరణ శాఖ ప్రకటనల నేపథ్యంలో ప్రధాన రహదారులు సైతం జన సంచారం లేక బోసిపోతున్నాయి.
ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, ఒంగోలు


