● కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్: జిల్లాను మాదకద్రవ్య రహితంగా చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు. స్థానిక ప్రకాశం భవన్ నుంచి బుధవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లాలో గుర్తించిన 20 హాట్ స్పాట్లలో విజిబుల్ పోలీసింగ్ ఉండాలన్నారు. మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఎకై ్సజ్, పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రెమడాల్, ఆల్ఫ్రజోలం మందులను వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించే ఔషధ దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని స్పష్టం చేశారు. గంజాయి కేసులు, సీజ్ చేసిన వాహనాల వివరాలను ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఆయేషా బేగం, పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలను ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు వివరించారు. డీఆర్‌ఓ శ్రీధర్‌రెడ్డి, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, ఆర్డీవోలు, డీఎస్పీలు, డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ ఉషారాణి, ఆర్‌ఐఓ ఆంజనేయులు, డీఈఓ రేణుక, మైన్స్ డీడీ రాజశేఖర్, మార్కెటింగ్ శాఖ ఏడీ వరలక్ష్మి పాల్గొన్నారు.
గుడ్లూరు: రామాయపట్నం పోర్టు మొదటి దశ నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. గుడ్లూరు మండలంలోని కర్లపాలెం గ్రామ నిర్వాసితులకు తెట్టు వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీని, తెట్టు నుంచి పోర్టు వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్ పనులను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. సాలిపేటలో ఎస్టీ కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పొర్టు పనులు, పరిపాలన భవన నిర్మాణానికి భూసేకరణపై సంబంధిత అఽధికారులతో సమీక్షించారు. అనంతరం చేవూరులో ఓటరు అనుసంధాన ప్రక్రియను పర్యవేక్షించారు. కలెక్టర్ వెంట జేసీ కల్పనాకుమారి, సబ్ కలెక్టర్ హిమవంశీ, మారిటైమ్ బోర్డు ఈఈ శివరాం, తహసీల్దార్ బాలకిశోర్, నవయుగ సంస్థ ప్రతినిధులు, స్థానిక అధికారులు ఉన్నారు.
కంభం: బైక్–లారీ ఢీకొన్న సంఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ప్రమాదం కంభం పట్టణంలో అనంతరం–అమరావతి హైవే బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. కంభం అర్బన్ కాలనీకి చెందిన అమిరిశెట్టి దిలీప్‌కుమార్(19) బుధవారం రాత్రి 8 గంటల సమయంలో బైక్‌పై వెళ్తూ అనంతపురం– అమరావతి జాతీయ రహదారిపై లారీని ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. కంభం ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహానికి కంభం ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


