ఉత్కంఠగా వాలీబాల్‌ టోర్నీ | - | Sakshi
Sakshi News home page

ఉత్కంఠగా వాలీబాల్‌ టోర్నీ

May 28 2026 2:10 AM | Updated on May 28 2026 2:10 AM

ఉత్కంఠగా వాలీబాల్‌ టోర్నీ

ఉలవపాడు: రామాయపట్నం కోస్టల్‌ సెక్యూరిటీ పోలీస్‌ స్టేషన్‌ ఆధ్వర్యంలో అలగాయపాలెం గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన వాలీబాల్‌ టోర్నమెంట్‌ను సీఐ జి.శివన్నారాయణ బుధవారం ప్రారంభించారు. ఉత్కంఠగా సాగిన డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లను ప్రేక్షకులు ఆసక్తిగా తిలకించారు. మైరెన్‌ స్టేషన్‌ పరిధిలోని 27 మత్స్యకార గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో యువత, క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలను జవహార్‌ భారతి కాలేజీ పీడీ పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమంలో ఎస్సై ఎ.భాస్కర్‌రావు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement