రాజ్యాంగ నిబంధనల ప్రకారం బీసీ రిజర్వేషన్లు | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ నిబంధనల ప్రకారం బీసీ రిజర్వేషన్లు

May 27 2026 10:32 AM | Updated on May 27 2026 10:32 AM

రాజ్యాంగ నిబంధనల ప్రకారం బీసీ రిజర్వేషన్లు రెండు బైక్‌లు చోరీ

ఒంగోలు సబర్బన్‌: రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు అవసరమైన అంచనా వేయడం కోసం డెడికేటెడ్‌ కమిషన్‌ కృషి చేస్తోందని కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం, వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్లో డెడికేటెడ్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా, కలెక్టర్‌ పి.రాజాబాబుతో కలసి ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్‌, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా మాట్లాడుతూ ప్రతి యూనిట్‌కు సంబంధించిన బీసీ జనాభా శాతం, రిజర్వేషన్‌ పరిమితులపై కమిషన్‌ సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉంటుందన్నారు. అందులో భాగంగా యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే సమగ్రంగా నిర్వహించి, కచ్చితమైన సమాచారం సేకరించాలని ఆదేశించారు. కలెక్టర్‌ పీ రాజాబాబు మాట్లాడుతూ జిల్లాలో ఏకీకృత కుటుంబ సర్వే సమగ్రంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా జనాభా గణాంకాలు, బీసీ వర్గాల ప్రాతినిధ్యం వంటి అంశాలపై కమిషన్‌కు సమగ్ర వివరాలు అందజేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. అనంతరం ప్రజల నుంచి, సంఘాల ప్రతినిధుల నుంచి చైర్మన్‌ వినతులు స్వీకరించడంతో పాటు వారి అభిప్రాయాలు, సమస్యలను నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో డెడికేటెడ్‌ కమిషన్‌ సెక్రటరీ డి.చంద్రశేఖర్‌ రాజు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకటేశ్వరరావు, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ లక్ష్మా నాయక్‌, జిల్లా బీసీ వెల్ఫేర్‌ అధికారి నిర్మలా జ్యోతి, సీపీఓ శ్రీనివాసులు రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన మున్సిపల్‌ కమిషనర్లు, డీఎల్‌డీఓలు, జీఎస్‌ డబ్ల్యూఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

మద్దిపాడు: మండలంలోని గుండ్లాపల్లి, కొష్టాలు సెంటర్‌ వద్ద రెండు ద్విచక్రవాహనాలు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఇళ్లనే దొంగలు టార్గెట్‌ చేశారు. ఇటీవల కాలంలో జాతీయ రహదారి వెంట పలు చోట్ల దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి బైక్‌ల దొంగతనం కలకలం రేపింది. మద్దిపాడు పోలీసులు రాత్రిళ్లు జాతీయ రహదారి వెంట గస్తీ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల వినతుల స్వీకరణ

బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా

Advertisement
 
Advertisement
Advertisement