● ఏపీసీపీడీసీఎల్ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు
ఒంగోలు సబర్బన్: వేసవిలో విద్యుత్ అంతరాయాలపై విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఏపీసీపీడీసీఎల్ ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయం నుంచి జిల్లాలోని అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. వేసవిలో ఏర్పడిన అధిక ఉష్ణోగ్రతలు, ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో వర్షపాతం వలన ఏర్పడుతున్న విద్యుత్ అంతరాయాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, మరమ్మతులు వెంటనే చేపట్టాలని, అన్నీ డివిజన్లలో కూడా కంట్రోల్ రూం పెట్టాలని ఆదేశించారు. ప్రజలు విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తెలపాలని లేదా సంబంధిత లైన్‌మెన్‌కి గానీ, సంబంధిత సబ్ స్టేషన్‌కి గానీ వెంటనే తెలియపరచాలని కోరారు.


