పొదిలి రూరల్: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానందరెడ్డి ఆకస్మికంగా ఆదివారం రాత్రి తనిఖీ చేశారు. టాయిలెట్స్, స్టాల్స్, మంచినీటి ప్లాంటును పరిశీలించారు. మరుగుదొడ్లతో పాటు, బస్టాండ్, పరిసరాలు నిత్యం శుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. బస్టాండ్‌లోని సమస్యల గురించి డీఎం శంకర్‌రావుతో మాట్లాడి తెలుసుకున్నారు. స్టాల్స్‌లో అనుమతించిన మేర మాత్రమే సరుకులు, వస్తువులు, పదార్థాలు విక్రయించాలని సూచించారు. అధిక ధరలకు విక్రయించినా, నాణ్యత లోపించినా చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఆయనతో పాటు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ ఉన్నారు.


