ప్రకాశం | - | Sakshi
Sakshi News home page

ప్రకాశం

May 24 2026 1:39 AM | Updated on May 24 2026 1:39 AM

మంత్రి ఇలాఖాలో కంత్రి పనులు – 8లో..

న్యూస్‌రీల్‌

వేసవి సెగలతో ఉడుకుతున్న ఉమ్మడి జిల్లా జిల్లాలో అత్యధికంగా 43 సెల్సియస్‌ ఉష్ణోగ్రత వడదెబ్బకు ఇద్దరు మృతి వరుసగా మరో నాలుగు రోజులపాటు ప్రతాపం చూపనున్న భానుడు రేపటి నుంచి 45 నుంచి 47 డిగ్రీలకు చేరుకుంటుందని హెచ్చరికలు రేపటి నుంచి రోహిణీ కార్తె ప్రారంభం

వడదెబ్బకు ఇద్దరు మృతి

ఆదివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 2026
ఇంట్లో ఉండలేక.. బయటకు రాలేక..

7

కొండపి మండలం పెద్దకండ్లగుంటలో టీడీపీ నాయకులు అక్రమాలకు తెరలేపారు.

కోర్టులో స్టే ఉన్న ప్రదేశంలో లెవలింగ్‌ పనులు చేస్తున్నారు.

ఒంగోలు సబర్బన్‌: భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. నాలుగు రోజులుగా ఉమ్మడి జిల్లా వేడి సెగలతో ఉడికిపోతోంది. 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. సోమవారం నుంచి రోహిణీ కార్తె ప్రారంభం కానుంది. 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు 44 నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా శనివారం అత్యధికంగా కొండపిలో 43 డిగ్రీలు నమోదైంది. కనిగిరి 42.5, పుల్లలచెరువు, అద్దంకిల్లో 42.1, ఒంగోలు, త్రిపురాంతకం, బల్లికురవ, జేపంగులూరు, చీమకుర్తి, నాగులుప్పలపాడుల్లో 42 డిగ్రీలు నమోదైంది. ఒంగోలు నగరంలో ఉదయం 11 గంటల వరకూ ఎండతీవ్రత తక్కువగా ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి భానుడు ప్రతాపం చూపించాడు. రాత్రి ఎనిమిది గంటలు దాటినా సెగలు తగ్గలేదు. కొన్ని ప్రాంతాల్లో తరుచూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా మారింది. రెండు రోజులుగా కరెంటు కోతలు విధిస్తుండడంతో ఇబ్బందులు పడ్డారు. ఇంట్లో ఉండలేక..బయటకు రాలేక పడుతున్న ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. భానుడి భగభగలతో జిలా్‌ోల్లని పలు ప్రాంతాలు ఉదయం 11 గంటల నుంచే జనంలేక వెలవెలబోయాయి. నిత్యం రద్దీగా ఉండే నగర కూడళ్లు సైతం నిర్మానుష్యంగా మారాయి. రాత్రి వేళలో కూడా వేడి తగ్గని పరిస్థితి ఉండడంతో వృద్ధులు, చిన్నారులే కాదు, యువత కూడా రోడ్డు మీదకు రావాలంటే భయపడుతున్నారు.

రేపటి నుంచి రోహిణీ కార్తె...

రోహిణీ కార్తె అంటేనే రోళ్లు పగులుతాయన్నది నానుడి. సోమవారం నుంచి రోహిణీ కార్తె ప్రారంభం కానుంది. అంతకు ఒక రోజు ముందు ఆదివారం నుంచే 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు ఉండవచ్చని వాతావరణ శాఖ సూచిస్తోంది.

మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దు..

ఎండలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల్లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావడం మంచిది కాదంటున్నారు. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇలాంటి వారు వడగాడ్పులకు త్వరగా డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. మరోవైపు గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల విషయంలోనూ అప్రమత్తత అవసరమని, ఇంట్లో ఉన్నా వేడి తీవ్రతకు గురవుతారని అంటున్నారు. ఇంట్లోకి వేడిగాలులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

రమేష్‌ బాబు (ఫైల్‌)

వేము నారమ్మ (ఫైల్‌)

ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉష్ణోగ్రతలు

గరిష్టం కనిష్టం

కొండపి 43 30

కనిగిరి 42.5 31

పుల్లలచెరువు 42.1 31

అద్దంకి 42.1 30

ఒంగోలు 42 30

త్రిపురాంతకం 42 31

బల్లికురవ 42 31

జేపంగులూరు 42 30

చీమకుర్తి 42 31

నాగులుప్పలపాడు 42 30

తాళ్లూరు 41 30

టంగుటూరు 41 30

తాళ్లూరు: మండలంలో వేర్వేరు గ్రామాల్లో వడదెబ్బకు శనివారం ఇద్దరు మృతి చెందారు. మండలంలోని రజానగరం ఎస్సీ కాలనీకి చెందిన పెరికల రమేష్‌ బాబు (45) వడదెబ్బకు మృతి చెందాడు. అతనికి మూడేళ్ల క్రితం ప్రమాదవశాత్తు కాలు విరిగింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే మండలంలోని చింతలపాలెం ఎస్సీ కాలనీకి చెందిన వృద్ధురాలు వేము నారమ్మ (70) వడదెబ్బతో మృతి చెందింది.

Advertisement
 
Advertisement
Advertisement