ఎంఆర్‌ఎఫ్‌ దుకాణంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

ఎంఆర్‌ఎఫ్‌ దుకాణంలో చోరీ

May 24 2026 1:39 AM | Updated on May 24 2026 1:39 AM

కంభం: పట్టణంలో ఓ దుకాణంలో చోరీ జరగగా మరో దుకాణంలో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. ఈ సంఘటనలు వేర్వేరు చోట్ల శుక్రవారం రాత్రి జరిగాయి. వివరాలు.. హైవే రోడ్డులో ఉన్న ఎంఆర్‌ఎఫ్‌ షోరూమ్‌లో రాత్రి షట్టర్‌ పగలగొట్టి కౌంటర్‌లో ఉన్న రూ.50 వేల నగదు అపహరించుకెళ్లారు. ఉదయం షోరూం వద్దకు వచ్చిన యజమాని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బస్టాండ్‌ సమీపంలో ఉన్న గణేష్‌ ఫర్నిచర్‌ షాపులో తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి చోరీకి విఫలయత్నం చేశారు. ఎస్సై శివకృష్ణారెడ్డి చోరీ జరిగిన షాపు వద్దకు వెళ్లి సీసీ కెమెరాలు పరిశీలించారు. ఎరుపు రంగు కారులో వచ్చిన వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. సీసీ కెమెరాలోని దృశ్యాల ద్వారా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మార్కాపురం నుంచి వచ్చిన క్లూస్‌ టీమ్‌ చోరీ జరిగిన దుకాణంలో వేలిముద్రలు సేకరించింది.

Advertisement
 
Advertisement
Advertisement