పొదిలి రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. పొదిలి మండలంలోని అక్కచెరువు సమీపంలో ఈ నెల 20వ తేదీ రాత్రి రెండు బేకులు ఢీకొని ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో గురుగుపాడు గ్రామానికి చెందిన యనమల చిరంజీవి తీవ్రగాయాలపాలై ఒంగోలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
కందుకూరు: పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌కాలనీ వాటర్ ట్యాంక్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు పట్టణ ఎస్సై శివనాగరాజు శుక్రవారం తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. వడదెబ్బ తగిలి సదరు వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించామన్నారు. 9121102203 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.


