ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక

May 23 2026 1:34 AM | Updated on May 23 2026 1:34 AM

ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక

ఒంగోలు: ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా నూతన కార్యవర్గాన్ని శుక్రవారం స్థానిక హైదరీ క్లబ్‌లో ఎంపిక చేశారు. ఏపీ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ నుంచి నీలాద్రి వెంకట కుమార్‌, పవన్‌కుమార్‌, ఒలంపిక్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు, ఎన్నికల అధికారి సిరిగిరి రంగారావు ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరిగింది. అధ్యక్షునిగా అంచిపోగు రమేష్‌బాబు, ఉపాధ్యక్షులుగా రోజర్‌ బిన్ని, తాళ్లూరి విజయ్‌కుమార్‌, ఆర్‌.రామతులసి, కోశాధికారిగా జాజుల శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులుగా బి.అమృత, జి.విజయ్‌భరత్‌, టి.ప్రదీప్‌, బి.రమాదేవిలను ఎన్నుకున్నారు. మాజీ అధ్యక్షుడు కావూరి విన్సెంట్‌ను గౌరవాధ్యక్షునిగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి రంగారావు ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement