డిగ్రీ మొదటి సెమిస్టర్‌ ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ మొదటి సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

May 22 2026 12:48 AM | Updated on May 22 2026 12:48 AM

డిగ్రీ మొదటి సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

ఒంగోలు సిటీ: డిగ్రీ మొదటి సంవత్సరం ఫలితాలను ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ వైస్‌ చాన్సిలర్‌ ప్రొఫెసర్‌ డీవీఆర్‌ మూర్తి గురువారం తన కార్యాలయంలో విడుదల చేశారు. మొత్తం 9,183 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా, 48.26 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పరీక్షల నియంత్రణాధికారి భారతీదేవి తెలిపారు. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వీసీ మూర్తి, రిజిస్ట్రార్‌ హరిబాబు అభినందించారు. కార్యక్రమంలో పరీక్షల నిర్వహణ సహాయకులు సురేష్‌ బాబు, పీజీ పరీక్షల కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్‌.శ్రీనివాసు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement