గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026

May 21 2026 12:32 AM | Updated on May 21 2026 12:32 AM

గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026 – 8లో.. రైతులకు సమాచారం చెప్పేదెవరు

న్యూస్‌రీల్‌

ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే రైతులపై ఎరువుల పిడుగు ఖరీఫ్‌ సాగులో రైతులకు అదనపు భారం భారీగా పెరిగిన ఎరువుల ధరలు జిల్లా రైతులపై రూ.91 కోట్ల అదనపు భారం బస్తాకు రూ.300 నుంచి రూ.400 వరకు పెరుగుదల ఖరీఫ్‌ సాగులో ఉమ్మడి జిల్లాలో 2,28,698 ఎకరాల్లో సాగు

ఖరీఫ్‌కు ముందే ఎరువుల ధరలు రైతుల మాడు పగులగొడుతున్నాయి.ఒక వైపు పంటలు సరిగ్గా పండకపోవడం, మరో వైపు గిట్టుబాటు ధరలు లభించకపోవడం, చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వెరసి పెరిగిన ధరలతో మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారైంది రైతుల పరిస్థితి. ఖరీఫ్‌ సీజన్‌ పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్న సమయాన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.91 కోట్లకుపైగా భారం పడుతుండడంతో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. రానున్న రోజుల్లో ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఎరువుల ధరలు ఎప్పుడు ఎంత పెరుగుతున్నాయో రైతులకు సమాచారం ఇచ్చే వ్యవస్థ లేకపోవడం దారుణమని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏ రకానికి ఎంత పెరిగిందో వ్యవసాయశాఖ నుంచి సైతం ఎలాంటి ప్రకటనలూ లేవు. నిబంధనల ప్రకారం ఎమ్మార్పీ కంటే అదనంగా అమ్మడానికి వీల్లేదు. అయితే పెరిగిన ధరల్ని చూపిస్తూ కొందరు పాత ఎమ్మార్పీలు ఉన్నా కొత్త ధరలపై విక్రయించే అవకాశం ఉంది.

ఎరువులు..

బెధరగొడుతున్నాయ్‌!

Advertisement
 
Advertisement
Advertisement