మార్కాపురం: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ ఎన్‌ఎంయూ రీజనల్ అసిస్టెంట్ సెక్రటరీ టి.మల్లికార్జునరావు, వైస్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట ఎన్‌ఎంయూ నాయకులు బుధవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీ్త్ర శక్తి బస్సుల్లో 0 టిక్కెట్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. పీఆర్‌సీ కమిటీని వెంటనే నియమించాలని, ఐఆర్ తక్షణమే ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌ను ఇవ్వాలని కోరారు. ప్రయాణికులకు సరిపడ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, కార్మికులకు గతంలో ఉన్న వైద్య సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కుమార్, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు, సిహెచ్ శ్రీనివాసులు, హుస్సేన్, సత్యనారాయణరెడ్డి, నాగ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


