దశదిన కర్మకు హాజరైన వైవీ, బూచేపల్లి | - | Sakshi
Sakshi News home page

దశదిన కర్మకు హాజరైన వైవీ, బూచేపల్లి

May 21 2026 12:32 AM | Updated on May 21 2026 12:32 AM

దశదిన కర్మకు హాజరైన వైవీ, బూచేపల్లి

తాళ్లూరు: తాళ్లూరుకు చెందిన సీనియర్‌ నాయకుడు, వ్యాపారవేత్త ఐవీరెడ్డి తండ్రి ఇడమకంటి చిన కోటిరెడ్డి దశదిన కర్మకు రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, అద్దంకి మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ వైవీ భద్రారెడ్డి హాజరయ్యారు. తొలుత చినకోటిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు తూము సుబ్బారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూదన్‌రెడ్డి, పార్టీ జిల్లా సెక్రటరీ మారం ఇంద్రాసేనారెడ్డి, ఐవీ సుబ్బారెడ్డి, దర్శి మండల కన్వీనర్‌ వెన్నపూస వెంకటరెడ్డి, ముండ్లమూరు ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మారెడ్డి, దర్శి వైస్‌ ఎంపీపీ దుర్గారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు హరిబాబు, జిల్లా రైతు విభాగం సెక్రటరీ సంగు కొండారెడ్డి, జిల్లా మైనారిటీ సభ్యుడు షేక్‌ కాలేషా, రైతు విభాగం అధ్యక్షుడు గువ్వల శ్రీనివాసరెడ్డి, యూత్‌ అధ్యక్షుడు కొర్రపాటి విష్ణు, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు యామర్తి ప్రభుదాస్‌, విద్యార్థి విభాగం అధ్యక్షుడు కై పు అశోక్‌రెడ్డి నాయకులు కోటా కృష్ణారెడ్డి, చార్లెస్‌ సర్జన్‌, ఐ.రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement