లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): సెంట్రల్ జీఎస్టీ గుంటూరు కమిషనరేట్ నూతన కమిషనర్‌గా అరుణ్ రిచర్డ్ మంగళవారం గుంటూరు కన్నావారితోటలోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2007 సివిల్ సర్వీసెస్ బ్యాచ్‌కి చెందిన అరుణ్ రిచర్డ్ విశాఖపట్నం జీఎస్టీ, కస్టమ్స్ జోన్‌లోని ఐదు కమిషనరేట్లకు అప్పిలేట్ అథారిటీగా, సెంట్రల్ ట్యాక్స్, కస్టమ్స్ అప్పీల్స్ కమిషనర్‌గా పనిచేస్తూ గుంటూరు జీఎస్టీకి బదిలీపై వచ్చారు. కమిషనర్ మాతృబాష తెలుగు అయినప్పటికీ, తెలుగు రాష్ట్రాలలో పనిచేయడం ఆయనకు ఇదే మొదటిసారి. బాధ్యతలు స్వీకరించిన అరుణ్ రిచర్డ్‌ను అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు కలిసి, పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కమిషనర్‌కు అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మీనారాయణ, జాయింట్ కమిషనర్ దేవ్‌కుమార్, పీఆర్‌ఓ ఆర్.పి.పి కుమార్‌లు ఘన స్వాగతం పలికారు. సిబ్బంది మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు.
అరుణ్ రిచర్డ్‌ను స్వాగతం పలుకుతున్న
అడిషనల్ కమిషనర్ లక్ష్మీనారాయణ


