మంచి నీరు ఎక్కువగా తాగాలి | - | Sakshi
Sakshi News home page

మంచి నీరు ఎక్కువగా తాగాలి

May 20 2026 10:43 AM | Updated on May 20 2026 10:43 AM

ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఎండల కంటే వేడి గాలులు, సెగ ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ప్రమాదం. ఉదయం 11 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది. ఒకవేళ అనివార్య కారణాలతో బయటకు వెళితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దాహం వేసినా, వేయకపోయినా అరగంటకోసారి 300 ఎంఎల్‌ నీళ్లు తాగాలి. నీళ్లతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఓఆర్‌ఎస్‌ పౌడర్‌, మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు తాగాలి. కూల్‌ డ్రింక్స్‌ తాగకపోవడమే మంచిది. వడదెబ్బ తగిలితే వెంటనే సమీపంలోని వైద్యశాలకు తరలించాలి. అశ్రద్ధ చేయకూడదు.

– డాక్టర్‌ ధీరజ్‌ బాబు సానాల, ఎండీ, జనరల్‌ ఫిజీషియన్‌, శ్రీ రామ్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌, ఒంగోలు

Advertisement
 
Advertisement
Advertisement