గ్రామ సచివాలయం భవనంపై టీడీపీ జెండా | - | Sakshi
Sakshi News home page

గ్రామ సచివాలయం భవనంపై టీడీపీ జెండా

May 20 2026 10:43 AM | Updated on May 20 2026 10:43 AM

గ్రామ సచివాలయం భవనంపై టీడీపీ జెండా

గిద్దలూరు రూరల్‌: టీడీపీ నేతల చేష్టలను ప్రజలను ఈసడించుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయంపై ఏకంగా టీడీపీ జెండా ఉంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని కంచిపల్లెలోని గ్రామ సచివాలయం భవనంపై టీడీపీ జెండాను ఎగురవేశారు. ఇంత బహిరంగంగా కార్యాలయంపై టీడీపీ జెండా ఎగురవేసినా అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల గ్రామస్తులు మండిపడుతున్నారు.

బెట్టింగ్‌ ముఠా అరెస్టు

పెద్దదోర్నాల: క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాను అరెస్టు చేసినట్లు సీఐ అజయ్‌కుమార్‌ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన మండల పరిధిలోని హరివిల్లు హోటల్‌వెనుక వైపున ఉన్న ప్లాట్ల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోనికి తీసుకొని విచారించారమని తెలిపారు. వీరిలో నలుగురు బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు నిర్ధారించి అదుపులోనికి తీసుకున్నట్లు చెప్పారు. గుంటూరుకు చెందిన నేలకుర్తి హరిబాబు అనే వ్యక్తితో కలిసిన ఈ నలుగురు ముఠాగా ఏర్పడి బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. నిందితులను మార్కాపురం కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్సై వెంకట రమణయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement