ఒంగోలు సిటీ: పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజా ఉద్యమాలకు పునరంకితం అవుతామని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. సీపీఎం ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు, నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. నివాళులర్పించారు. పలు ప్రాంతాల్లో మజ్జిగ పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, నగర కార్యదర్శివర్గ సభ్యులు జి. రమేష్, తంబి శ్రీనివాసులు మాట్లాడుతూ సుందరయ్య జీవితం నిరాడంబరతకు నిదర్శనమని కొనియాడారు. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాల నిర్మాణానికి ఆయన జీవితాంతం కృషి చేశారని తెలిపారు. కార్మిక, రైతాంగ, మహిళా ఉద్యమాలకు నాయకత్వం వహించడంతో పాటు తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్. వీరాస్వామి, దామా శ్రీనివాసులు, ఘట్టమనేని శ్రీనివాసరావు, ఎస్‌డీ హుస్సేన్, కొర్నిపాటి శ్రీనివాసులు, డి.వెంకటేశ్వర్లు, బేబీరావు పాల్గొన్నారు.


