స్పాట్‌ సాంకేతికమక | - | Sakshi
Sakshi News home page

స్పాట్‌ సాంకేతికమక

Apr 8 2026 7:08 AM | Updated on Apr 8 2026 7:08 AM

బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 – 8లో.. ఉపాధ్యాయులపై అదనపు భారం తగదు..

న్యూస్‌రీల్‌

పదో తరగతి మూల్యాంకనంలో ఉపాధ్యాయుల అవస్థలు పనిచేయని ట్యాబ్‌లు, సర్వర్లు తొలిరోజే సమస్యలు ఎదుర్కొన్న ఉపాధ్యాయులు సోమవారం అర్ధరాత్రి వరకూ కొనసాగిన స్పాట్‌ విధుల కేటాయింపుల్లో నిబంధనలకు తిలోదకాలు అధికారుల తీరుపై మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు

స్పాట్‌ ఆర్డర్లలో మాయాజాలం..

బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026
పదో తరగతి మూల్యాంకనంలో విద్యాశాఖ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు టీచర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. స్పాట్‌ ప్రారంభమైన తొలి రోజే సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ట్యాబ్‌ ఆధారిత అప్లికేషన్‌లో సాంకేతిక సమస్యలు, అదనపు పనిభారంతో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్‌ 6న ప్రారంభమైన ఈ ప్రక్రియలో మార్కుల నమోదు నెమ్మదిగా సాగుతుండటంతో ఆలస్యమవుతోంది. దీనికి తోడు జిల్లా విద్యాశాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో వారికి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇష్టారాజ్యంగా మినహాయింపులపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.

Ýë…MóS-†-MýS…V> ¡çÜ$-Mö-_a¯]l Ñ«§é-¯]l…™ø E´ë-«§éÅ-Ķæ¬ÌSOò³ A§ýl-¯]lç³# ¿êÆý‡… ç³yýl$-™ø…§ýl° E´ë-«§éÅĶæ$ çÜ…çœ*Ë$ BÆø-í³-çÜ$¢-¯é²Æ‡$$. çÜÇV>Y ç³°-^ólĶæ$° sêÅ»ŒæË$, ¯ðlsŒæ çÜÐ]l$-çÜÅ-ÌS™ø AÐ]lçܦË$ ç³yýl$-™èl$¯é²Æý‡° õ³ÆöP…-r$-¯é²Æ‡$$. „óS{™èl Ýë¦Æ‡$$ÌZ ÐéçÜ¢Ð]l ç³Ç-íܦ™èl$Ë$ ç³Ç-Ö-Í…-^èl-MýS$…yé Mö™èl¢ Ñ«§é¯]l… AÐ]l$Ë$ ^ólĶæ$yýl… çÜÇ-M>§ýl° A…r$-¯é²Æ‡$$. ✔️çÜ-Ð]l$-Æý‡¦-Ð]l…™èl-OÐðl$¯]l sêÅ»ŒæË$ A…¨…-^éÍ, íܦÆý‡-OÐðl$¯]l, ÐólVýS-Ð]l…-™èl-OÐðl$¯]l ¯ðlsŒæ-Ð]lÆŠ‡P MýS͵…^é-Í. ÐéçÜ¢Ð]l ç³Ç-íܦ-™èl$ÌSMýS$ A¯]l$-VýS$-׿…V> ç³°-¿êÆý‡… Ñ¿ýæ-h…-^é-ÌS-°, E´ë«§éÅ-Ķæ¬ÌS MýSÚët°² VýS$Ç¢…-_, çÜÐ]l$-çÜÅ-ÌS¯]l$ ™èl„ýS-׿Ðól$ ç³Ç-çÙP-Ç…-^éÌS° yìlÐ]l*…yŠæ ^ólçÜ$¢-¯é²Æ‡$$. Ð]lÊÌêÅ…MýS¯]l MóS…{§ýl…ÌZ ç³NÇ-¦-Ýë¦-Ƈ$$ÌZ Ð]lçÜ™èl$Ë$ MýSÍ-µ…-^éÌS° MøÆý‡$-™èl$-¯é²Æ‡$$.

ఒంగోలు సిటీ:

దో తరగతి మూల్యాంకనం 6వ తేదీ నగరంలోని డీఆర్‌ఆర్‌ స్కూలులో ప్రారంభమైంది. ఈ నెల 16వ తేదీ వరకూ జరుగుతుంది. ఇందుకు 23 గదులను ఏర్పాటు చేశారు. ప్రతి గదిలోనూ సీసీ కెమెరాలు అమర్చారు. ఈ కేంద్రంలో సుమారు 1.92 లక్షల పేపర్లను స్పాట్‌ వాల్యుయేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి 775 మంది ఉపాధ్యాయులను నియమించారు. అందులో స్పెషల్‌ అసిస్టెంట్లు 236 మంది, అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు 459 మంది, చీఫ్‌ ఎగ్జామినర్లు 80 మంది ఉన్నారు.

మూల్యాంకనం ఇలా..

ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు సరాసరి 40 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. ఉదయం 20, మధ్యాహ్నం 20 పేపర్లు చేయాల్సి ఉంది. గతంలో టీచర్లు దిద్దిన పేపర్లను ముగ్గురు స్పెషలిస్ట్‌ అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు మార్కులు టోటల్స్‌ చేసి సంతకాలు చేసేవారు. తాజాగా విద్యాశాఖ చేసిన మార్పుల ప్రకారం దిద్దిన సమాధాన పత్రాలను ట్యాబ్‌ల ద్వారా స్కాన్‌ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. మూల్యాంకనం చేసిన వెంటనే స్పెషల్‌ అసిస్టెంట్లుగా ఉన్న టీచర్లు స్కాన్‌ చేస్తారు. తరువాత స్థాయి అధికారి పరిశీలన అనంతరం ఆన్‌లైన్‌లో అప్లోడ్‌ చేస్తారు. రెండింటికీ తేడా ఉంటే ఆన్‌లైన్‌ తీసుకోదు. ఇంత కష్టపడుతున్నా స్పెషల్‌ అసిస్టెంట్లకు ఇస్తున్న వేతనం తక్కువగా ఉందని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.

సాంకేతిక సమస్యతో సతమతం..

విద్యాశాఖ నూతనంగా తీసుకొచ్చిన నిబంధనలు మూల్యాంకనం చేస్తున్న టీచర్ల పాలిట శాపంగా మారాయి. సాంకేతికంగా మార్పులు తీసుకువచ్చింది కానీ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోకపోవడంతో తొలిరోజే ఉపాధ్యాయులు అవస్థలు పడ్డారు. ఫలితంగా సాయంత్రం ఐదు గంటలకు ముగించాల్సిన స్పాట్‌ వాల్యుయేషన్‌ అర్ధరాత్రి వరకూ కొనసాగిందని టీచర్లు వాపోతున్నారు. రెండో రోజు పరిస్థితి కొంత మెరుగుపడినా కొన్ని సందర్భాల్లో సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయని తెలిసింది. స్పాట్‌ కోసం మొత్తం 300 ట్యాబ్‌లను వినియోగిస్తున్నారు.

పదో తరగతి మూల్యాంకనంలో టీచర్లకు విధులు కేటాయింపుల విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు రాజకీయ ఒత్తిడిలకు తలొగ్గి చాలా మందికి మూల్యాంకనం నుంచి మినహాయింపులు ఇస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా మందికి ఎలాంటి వినతులు చేసుకోకపోయినా మినహాయింపులు ఇస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. స్పాట్‌ ఆర్డర్లలో నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఐటీ సిబ్బంది కొందరు అధికారులకు తెలియకుండా మినహాయింపులు ఇచ్చినట్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయని తెలిసింది. ఫిజిక్స్‌ నుంచి మ్యాథ్స్‌ కన్వర్ట్‌ అయిన ఒక సంవత్సరం అర్హత గల వారిని సైతం ఎగ్జామినర్‌గా నియమించరని తెలుస్తోంది. అలాగే రెండు మూడు సంవత్సరాల నుంచి హైస్కూల్‌ ప్లస్‌లో ఇంటర్మీడియెట్‌ బోధిస్తున్న వారికి కూడా ఆర్డర్లు ఇచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా అధికారులు నిబంధనలకు నీళ్లు ఒదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement