ఒంగోలు టౌన్: టీబీ వ్యాధిపై అపోహలు తొలగించుకొని వైద్యులు సూచించిన విధంగా మందులు వాడాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు సూచించారు. వరల్డ్ టీబీ దినోత్సవం సందర్భంగా పల్మనాలజీ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పల్మనాలజీ హెచ్‌ఓడీ డా.రామస్వామి అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సు లో సూపరింటెండెంట్ మాణిక్యరావు మాట్లాడుతూ టీబీ నయమయ్యే వ్యాధి అని తెలిపారు. సకాలంలో వ్యాధిని గుర్తించి సరైన వైద్య చికిత్స పొందితే వ్యాధి పూర్తిగా నయమవుతుందని చెప్పారు. సీఎస్‌ఆర్‌ఎంఓ డా.మాధవీలత మాట్లాడుతూ వృద్ధుల్లో టీబీ వ్యాధి గురించి అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యులు సూచించిన మందులను మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైద్యులు రంజిత్ బాషా, సాంబశివరావు, కుమార్ వర్మ, పల్మనాలజీ సిబ్బంది పాల్గొన్నారు.


