మా గురించి పట్టించుకోనప్పుడు పన్నులెందుకు కట్టాలి..!
జె.పంగులూరు: ‘గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. పారిశుధ్య పనులు చేయడం లేదు. గ్రామంలో ఒక్క బోరు పనిచేయదు. ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. అలాంటప్పుడు మేమెందుకు పన్నులు కట్టాలిశ్రీ అని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ఇంటి పన్నుల వసూళ్లలో భాగంగా డీపీఓ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ కె.స్వరూపారాణి, డిప్యూటీ ఎంపీడీఓ సుమంత్, పంచాయతీ కార్యదర్శిఅనీల్‌కుమార్, వీఆర్‌ఓ రవికుమార్ కొండమూరు ఎస్సీ కాలనీకి వెళ్లారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో మంచినీటి ట్యాంకు పనికిరాకుండా పోయినా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీంతో డీపీఓ ఎం వెంకటేశ్వర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత గ్రామ సచివాలయాన్ని, డంపింగ్ యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ జిల్లాలో రూ.45 కోట్ల ఇంటి పన్నులు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.28 కోట్లు వసూలైనట్లు చెప్పారు.
అధికారులను నిలదీసిన గ్రామస్తులు


