నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలి

Feb 19 2026 6:20 PM | Updated on Feb 19 2026 6:20 PM

నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలి

నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలి

మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే పరిష్కరించాలని సీపీఎం రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దగ్గుబాటి సోమయ్య, నిర్వాసితుల సంఘ కన్వీనర్‌ గాలి వెంకటరామిరెడ్డి కోరారు. బుధవారం సాయంత్రం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈనెల 25న సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు పరిశీలన కోసం వస్తున్న నేపథ్యంలో నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 21న మార్కాపురం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శనివారం జరిగే ధర్నాకు ముంపు గ్రామాల ప్రజలు, రైతులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది వరద సీజన్‌కు నీరు విడుదల చేసే నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువతకులందరికీ 2013 భూ సేకరణ చట్టప్రకారం ఆర్‌అండ్‌ ఆర్‌ పరిహారం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో రాజేశ్వరరెడ్డి, అశోక్‌రెడ్డి, రామకృష్ణ, శ్రీనివాసులు, వెంకట సుబ్బయ్య, జి బాల నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement