శింగరకొండ తిరునాళ్లకు పటిష్ట ఏర్పాట్లు
అద్దంకి: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి శింగరకొండ తిరునాళ్లను విజయవంతం చేయాలని ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న అన్నారు. ఈ నెల 28 నుంచి 2వ తేదీ వరకు జరగనున్న లక్ష్మీ నరసింహస్వామి, శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై స్థానిక టీటీడీ కల్యాణ మండమంలో అధికారులతో బుధవారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈఓ తిమ్మానాయుడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆర్డీఓ మాట్లాడుతూ తిరునాళ్లకు ఈ ఏడాది 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. తాగునీరు, టాయిలెట్స్, క్యూలైన్లు ప్రభల వద్ద బందోబస్తు, తదితర ఆంశాలపై రెవెన్యూ, పోలీస్, అబ్కారీ, ఆర్‌అండ్‌బీ, పబ్లిక్ హెల్త్, విద్యుత్, ఆర్టీసీ, పంచాయతీరాజ్, రెవెన్యూ, తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఆయా శాఖల అధ్వర్యంలో చేసే ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ శాంతి భద్రఽతలకు విఘాతం కలగకుండా, చోరీలు జరగకుండా, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీఐ సుబ్బారావు తెలిపారు. ప్రధాన తిరునాళ్ల రోజున సంతమాగులూరు అడ్డరోడ్డు, మేదరమెట్ల పైలాన్ వద్ద అద్దంకి వైపు రాకుండా భారీ వాహనాలను దారి మళ్లిస్తామన్నారు. పోలీస్ అవుట్‌పోస్ట్ సమాచార కేంద్రం ఏర్పాటుతో ప్రభల వద్ద పటిష్ట బందోబస్తును పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. దేవస్థాన ఆధ్వర్యంలో రూ.50, రూ.100 ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు, ఉచిత దర్శన క్యూలైన్, స్నాన వసతి, ఉచిత తాగునీరు, మజ్జిగ, చంటి పిల్లలకు పాలు, సీ్త్రలకు విడిగా బయో టాయిలెట్స్, ఉచిత ప్రసాదం పంపిణీ చేస్తామని చెప్పారు. తరువాత శింగరకొండపాలెం పంచాయతీ ఏర్పాట్లుతో పాటు, మిగిలినశాఖల అధికారులు చేపట్టనున్న ఏర్పాట్ల గురించి వివరించారు. సమావేశంలో ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ చుండూరి మురళీ సుధాకర్‌రావు, ఏసీ తిమ్మనాయుడు, లక్ష్మి నరసింహ స్వామి దేవస్థాన చైర్మన్ శ్రీనివాసరావు, తహశీల్దార్ శ్రీచరన్, ఎంపీడీఓ వరూధిని, సీఐ సుబ్బరాజు, విద్యుత్ శాఖ ఈఈ మస్తాన్‌రావు, ఆర్టీసీ, ఫైర్, హెల్త్, శాఖల అఽఽధికారులు పాల్గొన్నారు.
2.5 లక్షల మంది భక్తులు వస్తారని
అంచనా
సీసీ కెమెరాలతో నిఘా
తిరునాళ్లకు ప్రత్యేక బస్సు సర్వీసులు
ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న


