శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
చర్చ జరగకుండానే బడ్జెట్ ఆమోదం అంచనాల్లో గ్రాంట్ల అంకెలే అధికం ఖర్చులు, రాబడి సంగతి పక్కకు.. రూ.247 కోట్ల బడ్జెట్‌పై 20 నిమిషాలు కూడా లేని చర్చ ఒంగోలు నగర పాలక సంస్థ బడ్జెట్ అంతా అంకెల గారడీ లోటు రూ.31 కోట్లు...అప్పులు రూ.10 కోట్లు రూ.75 కోట్లకు పైగా గ్రాంట్లు... రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా లేదు అప్పులు చూపించి.. జబ్బలు చరుచుకొని.. వైఎస్సార్ సీపీ, జనసేన కార్పొరేటర్ల ఆగ్రహం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆదాయం దిశగా...
నగరాభివృద్ధికి ఎంతో కీలకమైన సమావేశం..ప్రజలకు చేయాల్సిన సేవలు, రాబడులు, ఖర్చులు వీటన్నింటిపై లోతుగా చర్చించాల్సిన బడ్జెట్ సమావేశాన్ని మొక్కుబడిగా నిర్వహించి మ..మ అనిపించారు. ఒంగోలు నగరపాలక సంస్థ బడ్జెట్ అంతా అంకెల గారడీగా మారిపోయింది. లోటు రూ.31 కోట్లు..అప్పులు రూ.10 కోట్లుగా చూపించారు. గ్రాంట్ల ద్వారా రూ.75 కోట్లుగా లెక్కలు చూపించారు. మొత్తంగా రూ.247 కోట్ల బడ్జెట్‌కు సంబంధించిన సమావేశం కేవలం కనీస చర్చ జరపకుండా కేవలం 20 నిమిషాల్లో ముగించేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒంగోలు నగర పాలక సంస్థ 2026–27 బడ్జెట్ అంచనాల్లో అంతా అంకెల గారడీగానే ఉందని స్పష్టమవుతోంది. ఖర్చులు, రాబడి సంగతి పక్కన పెట్టి అప్పులు చూపించి అధికార పార్టీ నేతలు జబ్బులు చరుచుకున్నారు. బడ్జెట్ అంచనాలు మాత్రం రూ.247 కోట్లు చూపించారు. కానీ అందులో లోటు బడ్జెట్ రూ.31 కోట్లు ఉంది. హడ్కో రుణం రూ.5 కోట్లు, యూఐడీఎఫ్ రుణం మరో రూ.5 కోట్లు ఉంది. అంటే మొత్తం కలుపుకుంటే రూ.41 కోట్లు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు దాదాపు రూ.75 కోట్లు ఉన్నాయి. అన్నీ కలుపుకుంటే రూ.116 కోట్లు. ఒంగోలు నగర పాలక సంస్థ సంవత్సర ఆదాయం రూ.78 కోట్లు. కానీ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్(ఖర్చులు) మాత్రం రూ.120 కోట్లకు పైమాటే. రాని ఆదాయాన్ని చూపించి వస్తుందని నమ్మించే ప్రయత్నం మాత్రం స్పష్టంగా చేశారు. కొండ కింద ఉన్న ఐడీఎస్‌ఎంఎల్‌టీ ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.15 కోట్ల ఆదాయం కార్పొరేషన్‌కు వస్తుందని చూపించారు. ఈ ప్లాట్ల వ్యవహారం కొన్నేళ్లుగా పెండింగ్‌లోనే ఉంది. ఈ విధంగా రాని ఆదాయాలను మరికొన్నింటిని కూడా చూపించి అంకెల గారడీకి తెరలేపారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
ఒంగోలు నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం తూ..తూ మంత్రంగా సాగింది. పేరుకేమో రూ.247 కోట్ల బడ్జెట్...కానీ దాని సాధ్యాసాధ్యాలపై కనీసం అరగంట కూడా చర్చ జరగలేదు. అంటే ప్రజా సమస్యల పరిష్కారంపై టీడీపీ కూటమి పాలకులకు ఉన్న శ్రద్ధ ఏపాటిదో ఈ సమావేశం జరిగిన తీరు బట్టి తెలుస్తోంది. నగర మేయర్ సుజాత అధ్యక్షతన శుక్రవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాలులో అత్యవసర, 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాలతో కూడిన సమావేశం నిర్వహించారు. అయితే బడ్జెట్ విషయం మాత్రం పక్కదారి పట్టి పరనింద...పెదబాబు, చిన బాబు భజనలతోనే సరిపెట్టారు. బడ్జెట్ సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హైజాక్ చేశారు. టీడీపీ కార్పొరేటర్లు సైతం బడ్జెట్ అంశాన్ని పక్కన పెట్టేశారు. బడ్జెట్‌పై చర్చనే ప్రారంభించలేదు. బడ్జెట్‌పై సభ్యుల అభిప్రాయాలు చెప్పకముందే మేయర్ సుజాత ఎంపీ, ఎమ్మెల్యేలకు బయట కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వాళ్లు ప్రసంగిస్తారు అని ప్రకటించారు. దాంతో అసలు విషయం పక్కకు పోయింది. వారి ప్రసంగాలు పూర్తికాగానే రాష్ట్ర మంత్రి నారా లోకేష్(చిన బాబు) పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేక్ చేయటానికి ఎంపీ, ఎమ్మెల్యే పైకి లేవగానే మేయర్ సుజాత మాత్రం బడ్జెట్ ఆమోదించినట్లు ప్రకటించి వేదిక మీద నుంచి కిందకు దిగేశారు. దీంతో సమావేశ హాలులో ఉన్న కార్పొరేటర్లు అవాక్కయ్యారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు చిన బాబు పుట్టినరోజే ముఖ్యంగా భావించి వేడుకలు జరుపుకున్నారు. కనీస చర్చ జరగకుండా కౌన్సిల్‌లో బడ్జెట్ ఆమోదం అంటూ ప్రకటించిన మేయర్ పై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. తూ..తూ మంత్రంగా సమావేశం జరగటంపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కార్పొరేటర్, పార్టీ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
20 నిమిషాల్లోనే బడ్జెట్ సమావేశం ముగింపు:
రూ.247 కోట్ల అంచనాలతో కూడిన ఒంగోలు నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం కేవలం 20 నిమిషాల్లోనే ముగించారు. అసలు బడ్జెట్‌పై చర్చే నిర్వహించలేదు. సమావేశంలో మాట్లాడుతున్న జనసేన కార్పొరేటర్ ఈదర సురేష్ బాబు (చిన్నారి)ని మధ్యలోనే ప్రసంగం ఆపించిన మేయర్ సుజాత రాష్ట్ర మంత్రి చిన బాబు లోకేష్ పుట్టిన రోజు వేడుకలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరీ సమావేశాన్ని ముగించారు. చినబాబు మీద ఉన్న ప్రేమ ఒంగోలు నగర ప్రజలపై లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ కూటమిలోని జనసేన కార్పొరేటర్లు సైతం అసంతృప్తిని వ్యక్తం చేశారు.
రూ.14.21 కోట్ల మిగులు బడ్జెట్‌తో...
ఒంగోలు నగర పాలక సంస్థ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.14.21 కోట్ల మిగులు బడ్జెట్‌లో కౌన్సిల్ బలవంతంగా ఆమోదం పొందింది. 2025–26 సంవత్సరానికి సవరించిన అంచనాల బడ్జెట్ ప్రకారం రూ.86.06 కాగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాల ప్రారంభ నిల్వ రూ.46.44 కోట్లుగా ఉంది. 2025–26 సవరించిన బడ్జెట్ అంచనాల్లో మొత్తం జమలు రూ.138.96 కోట్లు కాగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాల మొత్తం జమలు రూ.200.77 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
2025–26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఖర్చులు రూ.178.54 కోట్లు కాగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.223 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేశారు. చివరకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి మిగులు రూ.46.44 కోట్లుకాగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి కేవలం రూ.14.21 కోట్లుగా చూపించారు. అంటే మిగులును కూడా మిగిల్చకుండా తినేశారన్నది స్పష్టమవుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు దాదాపు రూ.45 కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయి. వాటి ప్రస్తావనే లేకుండా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అత్యంత దారుణంగా మారింది.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఒంగోలు నగర పాలక సంస్థ ఆదాయం దిశగా అడుగులు ముందుకు వేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మిగులు నగదు రూ.80 కోట్లు ఉంది. అదే టీడీపీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు సీఎంగా వచ్చిన తరువాత 2025–26 ఆర్థిక సంవత్సరానికి వచ్చే సరికి రూ.51 కోట్లకు పడిపోయింది. అది కాస్తా 2026–27 సంవత్సరానికి వచ్చేసరికి మరీ దిగజారిపోయింది. ఈ బడ్జెట్ మాత్రం ఒంగోలు నగర పాలక సంస్థకు ఒక శాపంలా తయారయిందనే చెప్పాలి. భవిష్యత్తులో అప్పులు, బిల్లులు, బకాయీలు పెరిగే మాదిరిగా ఈ బడ్జెట్ ఉందని సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. చివరకు పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందించి ఆర్థిక క్రమశిక్షణ లోపించేలా బడ్జెట్‌ను రూపొందించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026
శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026
శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026
శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026


