వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యవర్గంలో నియామకాలు
ఒంగోలు సిటీ/మార్కాపురం:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పలువురికి రాష్ట్ర కార్యవర్గంలో పదవులు కేటాయించారు. ఒంగోలుకు చెందిన దామరాజు క్రాంతికుమార్, మార్కాపురం మండలం వేములకోటకు చెందిన ఏరువ ఆంజనేయరెడ్డి, కనిగిరికి చెందిన గుంటగాని అబ్రహాం (అభి)లను రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమించారు. అదేవిధంగా పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఒంగోలు నియోజకవర్గానికి చెందిన దేవరపల్లి అంజిరెడ్డిని నియమించినట్లు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. తమకు పదవులు రావడానికి కారణమైన రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైవీ.సుబ్బారెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మార్కాపురం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఒంగోలు ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు, నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యవర్గంలో నియామకాలు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యవర్గంలో నియామకాలు


