బ్యారన్ దగ్ధం, రూ.5 లక్షల నష్టం
వలేటివారిపాలెం మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం బ్యారన్ దగ్ధమైంది. అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన ఆవుల నరేష్ పొగాకు బ్యారన్‌లో క్యూరింగ్ చేస్తుండగా అల్లుడు కర్ర జారి మొద్దు గొట్టంపై పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బ్యారన్ మొత్తం వ్యాపించాయి. కందుకూరు అగ్నిమాపక అధికారులకు నరేష్ సమాచారం ఇవ్వగా అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే పొగాకు బ్యారన్ మొత్తం కాలిపోయింది. బ్యారన్‌లో ఉన్న ఆకుతో పాటు మొద్దు గొట్టం, టైర్లు, అల్లుడు కర్ర పూర్తిగా కాలిపోవడంతో రూ.5 లక్షల సష్టం వాటిల్లినట్లు నరేష్ వాపోయాడు.
కంభం: తనకు దొరికిన బంగారు చెవి బుట్టలను ఉపాధ్యాయుల చేతికిచ్చి రావిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని నిజాయితీ చాటుకుంది. వివరాలు.. రావిపాడు జెడ్పీ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న వీరిశెట్టి ప్రణవి మూడు రోజుల క్రితం పాఠశాలలో బంగారు చెవి బుట్టలు పోగొట్టుకుంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎంత వెతికినా కనిపించలేదు. శుక్రవారం ఉదయం పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని హఫీఫా కు ఆ వస్తువు దొరకగా ఉపాధ్యాయులకు అందజేసింది. విషయం తెలుసుకున్న ప్రణవి తండ్రి హఫీఫాకు పంజాబీ డ్రస్ బహుమతిగా ఇచ్చి అభినందించాడు. విద్యార్థిని నిజాయితీని హెచ్‌ఎం సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు ప్రశంసించారు.
గుడ్లూరు: కులం పేరుతో దూషించారని గుడ్లూరు పోలీస్ స్టేషన్‌లో గురువారం నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం విచారణ చేపట్టారు. మండలంలోని చినలాటరఫి పంచాయతీ ఆర్‌సీ అగ్రహారం గిరిజన మహిళ కొమరగిరి గోవిందమ్మకు సర్వే నంబర్ 805లో 3 ఎకరాల 2 సెంట్ల అసైన్ భూమి ఉంది. ఆ భూమి విషయంలో అదే గ్రామానికి చెందిన పొన్నగంటి కొండయ్య, వారి బంధువులు కులం పేరుతో తనను దూషించారని గోవిందమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దీనిపై డీఎస్పీ విచారణ నిర్వహించారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. డీఎస్పీ వెంట గుడ్లూరు ఎస్సై వెంకట్రావు ఉన్నారు.
● రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం
మార్కాపురం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమైన సంఘటన మార్కాపురం మండలంలోని చెన్నారెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. చెన్నారెడ్డిపల్లి ఎస్సీ కాలనీలో నివాసముండే మురారి శ్యామల ఇంట్లో విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ కావడంతో గృహోపకరణాలు, ఇతర సామగ్రి మొత్తం కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. కట్టుబట్టలతో మిగిలిన శ్యామల.. కాలిపోయిన ఇంటిని చూస్తూ కన్నీరు మున్నీరుగా విలపించింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేసింది.
మార్కాపురం: మార్కాపురం పట్టణ శివారులోని వై.జంక్షన్ వద్ద శుక్రవారం సాయంత్రం జామాయిల్ తోటలో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ తన సిబ్బందితో కలిసి మంటలను అదుపుచేశారు. తోటలో కొంతమేర చెట్లు కాలిపోయాయని, సుమారు రూ.10 వేల నష్టం వాటిల్లిందని చెప్పారు.
బ్యారన్ దగ్ధం, రూ.5 లక్షల నష్టం
బ్యారన్ దగ్ధం, రూ.5 లక్షల నష్టం
బ్యారన్ దగ్ధం, రూ.5 లక్షల నష్టం


