యోగి వేమనకు కలెక్టర్ నివాళులు
ఒంగోలు సబర్బన్: విశ్వకవి యోగి వేమన జయంతిని పురస్కరించుకుని సోమవారం ఒంగోలు కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్ హాల్లో కలెక్టర్ పి.రాజాబాబు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. వేమన శతకాల గురించి మాట్లాడా రు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్‌రెడ్డి, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
మహనీయుడు.. వేమన : ఎస్పీ
ఒంగోలు టౌన్: సమాజంలోని కులమత వ్యత్యాసాలను తీవ్రంగా వ్యతిరేకించిన మహనీయుడు యోగి వేమన అని, ఆయన బోధించిన నీతి పద్యాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఎస్పీ హర్షవర్థన్‌రాజు కొనియాడారు. మహాకవి యోగి వేమన జయంతి సందర్భంగా సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో మూఢాచారాల నిర్మూలనకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త యోగి వేమన అని అన్నారు. మానవ జీవితానికి సంబంధించిన అనేక నిత్య సత్యాలను సామాన్యుడు సైతం సులువుగా పలికే విధంగా తేటతెనుగు పదాలతో ఆవిష్కరించారని తెలిపారు. వేమన పద్యాల్లోని జీవిత సత్యాలు నేటి కాలానికి ఎంతో అవసరమని, ఆయన బోధించిన నైతిక విలువలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
● ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్ శివరామిరెడ్డి
మార్కాపురం: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న గ్రామాల్లో కొంతమందికి రూ.80 కోట్లతో ఆర్‌అండ్‌ఆర్ పరిహారానికి ప్రతిపాదనలు పంపామని, మార్చి లోగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమవుతుందని ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడారు. లక్ష్మీపురం, సాయి నగర్, అక్కచెరువు తాండ, సుంకేశులలో కొంతమందికి, కృష్ణానగర్, రామ లింగేశ్వరపురం, చింతలముడిపి, కాటంరాజు తండాలో ఉన్న నిర్వాసితులకు నష్టపరిహారం షందజేస్తామన్నారు. ఓసీ, బీసీ కుటుంబాలలో అర్హులైన ఒక్కో కుటుంబానికి రూ.11.76 లక్షలు, ఎస్సీలకు రూ.12.50 లక్షలు, ఎస్టీలకు రూ.13.01 లక్షలు అందజేస్తామన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు.
మార్కాపురం: పట్టణ శివార్లలోని డ్రైవింగ్ స్కూల్‌కు చెందిన లారీ సోమవారం సాయంత్రం మంటల్లో కాలిపోయింది. ఈ లారీని డ్రైవింగ్ స్కూల్ యాజమాన్యం హెవీ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ట్రయల్ కోసం ఉపయోగిస్తుంటారు. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా క్యాబిన్ నుంచి మంటలు చెలరేగాయి. స్థానికులు గుర్తించి అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు మంటలను చల్లార్చారు. ప్రమాదంలో రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. ఈ సంఘటనపై డ్రైవింగ్ స్కూల్ ప్రతినిధులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తాళ్లూరు: అదుపుతప్పి కారు బోల్తా పడింది. ఈ సంఘటన సోమవారం స్థానిక గంగమ్మ తల్లి దేవస్థాన సమీపంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం..మండలంలోని తూర్పు గంగవరం చీమకుర్తి ప్రధాన రోడ్డు మార్గాన గంగమ్మ తల్లి దేవస్థానం సమీపంలో అధిక వేగంతో వస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
యోగి వేమనకు కలెక్టర్ నివాళులు
యోగి వేమనకు కలెక్టర్ నివాళులు
యోగి వేమనకు కలెక్టర్ నివాళులు


