డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి
టంగుటూరు: డివైడర్‌ను ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని వల్లూరు జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై సోమవారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. గూడూరు గ్రామానికి చెందిన బొమ్మిడి మోహన్(28) హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ పండుగ సెలవులకు స్వగ్రామానికి వచ్చి వచ్చాడు. సెలవుల అనంతరం హైదరాబాద్ వెళుతుండగా వల్లూరు సమీపంలో ఫ్లైఓవర్‌పై ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు.
అద్దంకిరూరల్: విద్యుదాఘాతానికి విద్యార్థిని మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని తిమ్మాయపాలెంలో సోమవారం సాయంత్రం జరిగింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. అద్దంకిలోని గుర్రాలకాలనీకిచెందిన దాసరి సింగయ్య దంపతులు తిమ్మాయపాలెం లోని ఇటుకబట్టీల వద్ద కూలీ పనిచేస్తూ జీవిస్తున్నారు. సింగయ్య కుమార్తె సుస్మిత (13) 9వ తరగతి చదవుతుంది. బట్టీల వద్ద ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన సుస్మిత ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై స్పృహ తప్పి పడిపోయింది. స్థానికులు హుటాహుటిన అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. సింగయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి


