ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన పాలవ్యాన్
ఉలవపాడు: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి పాలవ్యాన్ ఢీకొట్టడంతో ఢీకొన్న పాలవ్యాన్ డ్రైవర్ దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చాగల్లు–వీరేపల్లి మధ్య గురువారం జరిగింది. వివరాలు.. దేవి వెనామీ ఫీడ్ తీసుకెళ్లే లారీ ముందు నిలిపి ఉంది. ఈ సమయంలో సంతమాగులూరు నుంచి గాయత్రి మిల్క్‌కు చెందిన పాలవాహనం కావలికి వెళ్తూ ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది. బలంగా ఢీ కొనడంతో మద్దిపాడు మండలం వెల్లంపల్లికి చెందిన డ్రైవర్ రాకొండి దుర్గా మహేష్ (25) వాహనంలోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు భవానీ మాల ధరించి ఉన్నాడు. ఇంకా వివాహం కాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉలవపాడు సీహెచ్‌సీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాలవ్యాన్ డ్రైవర్ మృతి


