రాయితీ పేరుతో దగా
పన్నుల పెంపుపై పునరాలోచన చేయని ప్రభుత్వం ప్రజలను మోసగించేందుకు ఎత్తుగడలు వేస్తోంది. పన్ను చెల్లింపు ఒక నెల ఆలస్యమైనా 24 శాతం వడ్డీ.. పెనాల్టీ రూపంలో వసూలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో.. అంటే ఏప్రిల్‌లో పన్నుల డిమాండ్ నోటీసులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అదే మాసం చివరినాటికి నగదు చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత హామీని విస్మరించడంతో ప్రజలపై 30 శాతం పన్నుల భారం పడింది. పెరుగుతున్న ఇంటి పన్నులు చెల్లించలేక యజమానులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. పట్టణాల్లో గృహా, వాణిజ్య భవనాల ద్వారా సుమారు పది నుంచి ఇరవై శాతం ఆదాయం పెంచుకునే విధంగా మున్సిపల్ రెవెన్యూ, సచివాలయం, పట్టణ ప్రణాళిక విభాగాల సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఇంటింటి సర్వే చేపడుతుండటంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు.


