వందేమాతరం గీతానికి 150 ఏళ్లు
● గీతాలాపన చేసిన కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్: వందేమాతరం గీతం భారతీయులందరికీ గర్వకారణమని కలెక్టర్ పీ రాజాబాబు అన్నారు. శుక్రవారం ఉదయం ప్రకాశం భవనం సమీపంలోని చర్చి సెంటర్, అంబేడ్కర్ విగ్రహం వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు మానవహారంగా ఏర్పడి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ గీతాన్ని మొదటిసారి ఆలపించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పిలుపుమేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. భారతీయులందరూ ఒకటేనంటూ ఐక్యతను చాటుతూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించిన వందేమాతరం గీతం గొప్పదనాన్ని మరోసారి నేటి తరానికి కూడా తెలియజేసేలా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ గీతాలాపనకు పిలుపునిచ్చిందన్నారు. ఈ గీతం విశిష్టతను అందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నాటి స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేసేలా ఏడాది పాటు ప్రత్యేక ఉత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవదాయ శాఖామంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి రామనారాయణరెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, పీడీసీసీబీ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు మేయర్ సుజాత, జేసీ గోపాలకృష్ణ, డీఆర్‌ఓ ఓబులేసు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఒంగోలు సబర్బన్: పర్యావరణాన్ని కాపాడుకోవటంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పీ రాజాబాబు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఒంగోలు నగరంలో ఐదు వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు చేపట్టారు. ప్రజాప్రతినిధులతో కలిసి ముందుగా ఒంగోలు మార్కెట్ యార్డ్ సమీపంలోని ఆచార్య ఎన్జీ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అంజయ్య రోడ్డులో కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్థన్‌రాజు, జేసీ గోపాలకృష్ణతో కలిసి మొక్కలు నాటారు. నగరంలోని ఎనిమిది ప్రధాన రహదారుల వెంట పది కాలేజీల విద్యార్థులను భాగస్వాములను చేస్తూ మొక్కలు నాటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీటిని జియోట్యాగ్ చేస్తూ పర్యవేక్షణ బాధ్యతలను కూడా వారికే అప్పగిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దనరావు, ముత్తుమల అశోక్‌రెడ్డి, బీఎన్ విజయ్ కుమార్, పీబీసీసీబీ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఒంగోలు నగర మేయర్ సుజాత, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకటరావు, ఒంగోలు నగర కమిషనర్ వెంకటేశ్వరరావు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
పెద్దదోర్నాల: వెలిగొండ ప్రాజెక్టు పనులను వచ్చే ఏడాదికి పూర్తి చేసి ఆయకట్టు రైతాంగానికి పూర్తి స్థాయిలో నీరు అందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇటీవల మోంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్‌ను ఇరిగేషన్ నిపుణుల బృందంతో కలిసి శుక్రవారం మంత్రి పరిశీలించారు. మోంథా తుఫాన్ వర్షాలకు ఫీడర్ కెనా ల్ 850 మీటర్ల వద్ద 100 అడుగుల పొడవున 30 అడుగుల లోతులో పడిన గండిని మంత్రి పరిశీ లించారు. టన్నెళ్లలోకి 9 కిలోమీటర్ల మేర చొచ్చు కొచ్చిన నీటిని తొలగించే పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వెలిగొండ క్యాంపు ఆఫీస్‌లో సమావేశం నిర్వహించారు.
వందేమాతరం గీతానికి 150 ఏళ్లు
వందేమాతరం గీతానికి 150 ఏళ్లు


