ఒంగోలు సబర్బన్: లోప రహిత ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కలెక్టర్ పి.రాజాబాబు ఎన్నికల అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్)పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఈఆర్వోలతో కలెక్టర్ మాట్లాడారు. రోజూ రెండు నియోజకవర్గాల ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో చర్చించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, లోప రహితంగా సాగేలా చూడాలని డీఆర్వో ఓబులేసును ఆదేశించారు. ఏఈఆర్‌ఓలు కూడా బీఎల్వోలు, సూపరింటెండెంట్లతో ఇదే మాదిరిగా సమావేశం నిర్వహించి ఈ ప్రక్రియ వేగంగా జరిగేలా చూడాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ మొత్తం ప్రక్రియకు ఒక ప్రణాళిక రూపొందించాలని డీఆర్‌ఓకు సూచించారు. సమావేశంలో వివిధ నియోజకవర్గాలకు ఈఆర్వోలుగా ఉన్న ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మాధురి, కుమార్, జాన్సన్, సత్యనారాయణ, పలువురు ఏఈఆర్వోలు పాల్గొన్నారు.
ఈఆర్‌ఓలతో సమీక్షలో కలెక్టర్
రాజాబాబు


