ప్రజల మంచి కోసమే కోటి సంతకాల ఉద్యమం
పొదిలి రూరల్: ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణ కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుని, ప్రజలకు మంచి చేయాడానికి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టామని ఆ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేర్కొన్నారు. పొదిలి మండలంలోని ఆముదాలపల్లి, అన్నవరం గ్రామాల్లో పార్టీ మండల అధ్యక్షుడు గుజ్జుల సంజీవరెడ్డి, కొత్తపులి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆయా గ్రామాల్లో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ.. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం, విద్యను అందించాలన్న సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే, కూటమి ప్రభుత్వం వాటిని ప్రజలకు దూరం చేసే దుర్మార్గానికి పూనుకుందని ధ్వజమెత్తారు. రూ.లక్ష కోట్లు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను, వేలాది ఎకరాల భూములను పీపీపీ విధానంలో తన తాబేదార్లకు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు బరితెగించారని దుయ్యబట్టారు. పీపీపీ విధానం వల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదన్నారు. విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందని, కుట్రలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. నాలుగు పర్యాయాలు సీఎంగా ఉంటూ రారష్ట్‌రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా తేలేని చంద్రబాబుకు.. జగనన్న పాలనలో తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న మహా నాయకుల కలలను, వారి ఆశయాలను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సాకారం చేసేందకు పూనుకుందన్నారు. అయితే కూటమి నేతలు ఎన్నికల ముందు మాయ మాటలు, అబద్ధాలు, మోసాలతో గద్దెనెక్కి ప్రజలను నట్టేట ముంచేందుకు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. కాగా అన్నవరంలో మహిళలు అన్నా రాంబాబు, పార్టీ నేతలకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో సర్పంచ్ శిరిమల్లె శ్రీనివాసరావు, రాములవీడు శ్రీను, ప్రసాదు, ఇనగాల వెంకటేశ్వరరెడ్డి, కె.సుబ్బారావు, కె.శ్రీనివాసరావు, చల్లా వెంకట రామిరెడ్డి, కోదండరామిరెడ్డి, రబ్బానీ, పార్టీ వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆముదాలపల్లిలో సంతకాలు చేస్తున్న
గ్రామస్తులతో అన్నా రాంబాబు
ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోనే బాధ్యత ప్రజలదే..
కూటమి కుట్రలను కలిసికట్టుగా తిప్పికొడదాం
వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్‌చార్జి అన్నా రాంబాబు


