వైఎస్ జగన్‌ను కలిసిన బూచేపల్లి
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ గురువారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి పలు విషయాలపై మాట్లాడారు.
ఒంగోలు టౌన్: తాళ్లూరు మండలం శివరాంపురం ఎస్సీకాలనీకి చెందిన దళితులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నాడని తాళ్లూరు ఎస్సై మల్లికార్జునపై ఆరోపణలు రావడం తెలిసిందే. దీనిపై శివరాంపురం గ్రామానికి చెందిన దళితులు ఒంగోలులోని అంబేడ్కర్ భనవం ఎదుట నిరసన వ్యక్తం చేయడంతో పాటు కలెక్టర్, ఎస్పీలను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎస్సైని జిల్లా పోలీసు కార్యాలయానికి పిలిపించుకున్న ఎస్పీ హర్షవర్థన్‌రాజు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణా చర్యల్లో గురువారం చార్జిమెమో జారీ చేసినట్లు సమాచారం. అలాగే ఎస్సై మీద వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్టు తెలిసింది.
ఎస్సైపై చర్యలు తీసుకోవాలి...
తాళ్లూరు మాదిగలను కులం పేరుతో దూషించడం, అసభ్యంగా మాట్లాడడం, భయభ్రంతాలకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడుతున్న ఎస్సై మల్లికార్జునపై తగిన చర్యలు తీసుకోవాలని మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము సుజన్ విజ్ఞప్తి చేశారు. సమితి నాయకులతో కలిసి గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ హర్షవర్థన్‌రాజుకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వ్యవహారశైలిపై విచారణ జరిపించాలని కోరారు. ఎస్సైతో పాటు కానిస్టేబుల్ బాబూరావు సెటిల్మెంట్లు చేస్తూ ఎస్సీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు గద్దే త్యాగరాజు, కొలకలూరి విజయ కుమార్, డి.అప్పారావు, పొగడ్త నారాయణ, అనపర్తి ఆదాం, గర్నెపూడి యోహాను తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు వన్‌టౌన్: స్వయం ఉపాధి పొందుతున్న దివ్యాంగులతో పాటు విద్యార్థులైన దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటీలు, రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలు మంజూరు చేయనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్ సువార్త గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకానికి అర్హులైన శారీరక దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసుండి ఒకటీ లేదా రెండు లోయర్ లింబ్స్ ప్రభావితమై 70 లేదా అంతకంటే ఎక్కువ శాతం శారీరక వైకల్యం ఉన్న వారు, వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే తక్కువ ఉన్నవారు అర్హులని తెలిపారు. దరఖాస్తుదారులకు డ్రైవింగ్ లెసెన్సు ఉండాలన్నారు. ప్రభుత్వం నుంచిగానీ, ప్రైవేటు సంస్థల నుంచిగానీ ఇంత వరకూ ఎటువంటి వాహనాలు కలిగి ఉండకూడదన్నారు. దరఖాస్తుదారుల పేరుతో ఎటువంటి వాహనం ఉండకూడదన్నారు. దరఖాస్తుదారులు రెగ్యులర్ పద్ధతిలో గ్రాడ్యుయేషన్ లేదా పైస్థాయి కోర్సులు అభ్యసిస్తూ ఉండాలన్నారు. స్వయం ఉపాధి అయిన వ్యవసాయం, అనుబంధ రంగాలలో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉన్న ఉద్యోగి అయి ఉండాలన్నారు. ఇటువంటి వారికి కనీస విద్యార్హత 10వ తరగతి అని తెలిపారు. అర్హులైన వారు విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సహాయక సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా దివ్యాంగుల శాఖ కార్యాలయంలోగానీ, 08592–281310 ఫోన్ నంబర్‌నుగానీ సంప్రదించాలని కోరారు.
వైఎస్ జగన్‌ను కలిసిన బూచేపల్లి


