
డీటీసీని పరిశీలించిన ఎస్పీ
ఒంగోలు సిటీ: స్థానిక కొత్తమామిడిపాలెంలోని పోలీస్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్‌ను ఎస్పీ హర్షవర్ధన్‌రాజు శనివారం పరిశీలించారు. 208 మంది పోలీసు కానిస్టేబుళ్లకు త్వరలో శిక్షణ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో డీటీసీని ఎస్పీ సందర్శించారు. పరిసర ప్రాంతాలు, మౌలిక సదుపాయాలు, బ్యారక్‌లు, తరగతి గదులు, పరేడ్ గ్రౌండ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. వంట గదిలో అపరిశుభ్రతను గుర్తించి వెంటనే మార్పులు చేయాలన్నారు. డైనింగ్ హాళ్లలో తలుపులు, పెయింటింగ్‌తో పాటు పైకప్పు నుంచి కారుతున్న వర్షం నీటిని గుర్తించి వెంటనే మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. శారీరక శిక్షణ, పరేడ్ ప్రాక్టీస్‌కు ఉపయోగపడేలా గ్రౌండ్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మైదానం చదునుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, రన్నింగ్ ట్రాక్, డ్రిల్ ఏరియా, గార్డెన్ వంటి సదుపాయాలు, అదనపు మౌలిక వసతుల ఏర్పాటు, శుభ్రతపై నిరంతర దృష్టి అవసరమని అధికారులకు సూచించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి నిపుణుల ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మొక్కలు నాటి ట్రైనింగ్ సెంటర్ పరిసరాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండేలా చూడాలన్నారు. ఎస్పీ వెంట ఏఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, కనిగిరి డీఎస్పీ సాయిఈశ్వర్ యశ్వంత్, డీపీఓ రామ్మోహన్‌రావు, పోలీస్ క్లినిక్ డాక్టర్ భానుమతి, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర, తాలూకా సీఐ విజయకృష్ణ, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ దేవప్రభాకర్, ఆర్‌ఐలు సీతారామిరెడ్డి, రమణారెడ్డి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.