
పాకల బీచ్‌ను అభివృద్ధి చేస్తాం
● కలెక్టర్ రాజాబాబు
సింగరాయకొండ: పర్యాటక రంగ అభివృద్ధికి అవకాశం ఉన్న పాకల బీచ్‌ను అన్ని రకాలా అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. పాకల బీచ్‌ను శనివారం మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ బీచ్‌కు వచ్చే పర్యాటకులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మరుగుదొడ్లు, స్నానపుగదులు, దుస్తులు మార్చుకోడానికి వీలుగా సౌకర్యాలు కల్పించాలన్నారు. బీచ్‌లో మొక్కలను నాటారు. అంతకుముందు మండల కేంద్రంలో జరిగిన స్వర్ణాంధ్ర– స్వచ్చాంధ్ర కార్యక్రమంలో మంత్రి స్వామి, డీపీఓ వెంకటేశ్వర్లు పాల్గొని ప్రజలకు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను తెలియజేశారు. విద్యార్థులు సైకిల్‌ర్యాలీ నిర్వహించారు. పారిశుధ్య కార్మికులకు దుస్తులు అందజేసి సత్కరించారు. జెడ్పీ సీఈఓ చిరంజీవి, ఆర్డీఓ కళావతి, తహసీల్దార్ రాజేష్, ఈఓ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.