
17న జాబ్ మేళా
ఒంగోలు సబర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 17న ఎస్‌ఎన్‌పాడు మండలంలోని ఎండ్లూరి డొంకలోని మహిళా ప్రాంగణంలో ‘జాబ్ మేళా‘ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పీ.రాజా బాబు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం తన ఛాంబర్‌లో అందుకు సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో హెటెరో లాబ్స్, శ్రీ చక్ర హ్యుందాయ్, ఎంఆర్‌ఎఫ్, బ్రహ్మ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, భారత్ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్, టాటా ఎలక్ట్రానిక్స్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, పీఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్, తిరుమల ఆటోమోటివ్స్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. 18 నుండి 35 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు తమ అర్హత ప్రకారం ఈ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. బీటెక్, డిగ్రీ, ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిప్లొమా, పీజీ వంటి అర్హతలున్న అభ్యర్థులకు వివిధ రంగాల్లో అవకాశాలు లభించనున్నాయి. జిల్లా యువత తమ రిజిస్ట్రేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పూర్తి చేసుకోవాలని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం సంప్రదించాల్సిన టోల్ ఫ్రీ నంబర్లు: 99888 53335, 87126 55866, 87901 18349, 87901 17279 ఈ నంబర్లతో పాటు కార్యాలయంలో అందుబాటులో సంప్రదించవలసిన ఎస్.కె. బాషా: 99630 05209 ను కూడా సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారి రమాదేవి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జె.రవితేజతో పాటు ఇతర ఇతర అధికారులు పాల్గొన్నారు.