
విద్యుదాఘాతానికి బేల్దారి కూలీ మృతి
కంభం: విద్యుదాఘాతానికి బేల్దారి కూలీ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..కందులాపురం కూడలి సమీపంలో నిర్మాణంలో ఓ గృహం వద్ద పసుపుల పెద్ద గురువయ్య(53) అనే వ్యక్తి పనిచేస్తున్న సమయంలో ఆ గృహానికి ముందు భాగంలో ఉన్న విద్యుత్‌లైన్ తీగలకు తగిలి షాక్ గురై కిందకు పడిపోయాడు. అతన్ని వెంటనే కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.