
బీకే త్రషర్స్‌ను పరిశీలించిన బీమా కంపెనీ
సింగరాయకొండ: అగ్నిప్రమాదం సంభవించిన బీకే త్రషర్స్ కంపెనీని ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, క్లూస్ టీం సిబ్బంది శనివారం పరిశీలించారు. మూడు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేప్రయత్నం చేశాయని, మంటలు అదుపులోనే ఉన్నా ఇంకా బేళ్లు మండుతున్నాయని కంపెనీ ప్రతినిధులు వారికి వివరించారు. కాగా బీకేటీ కంపెనీ శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తమ కంపెనీలో జీపీఐకి చెందిన రూ.550 కోట్ల విలువైన పొగాకు, ఎల్‌అండ్‌ఎం కంపెనీకి చెందిన రూ.18 కోట్ల విలువైన పొగాకు కాలిపోయిందని, గోడౌన్‌కు రూ.30 కోట్లు కలిపి మొత్తం రూ.598 కోట్ల నష్టం వాటిల్లిందని జీఎం శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు.
గిద్దలూరు రూరల్: పట్టణంలోని 9వ వార్డు కుమ్మరివీధిలో పల్లె నాగమ్మకు చెందిన మట్టి మిద్దె ప్రమాదవశాత్తూ కూలిపోయింది. శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి మిద్దె పూర్తిగా నాని ఉంది. ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఆ సమయంలో నాగమ్మ వరండాలో నిద్రిస్తుండటంతో ప్రమాదం తప్పింది. మిద్దెలోని దంతెలు, మట్టి కిందపడిపోవడంతో ఇంట్లోని వస్తువులు, నిత్యావసర సరుకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మిద్దె కూలి తనకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది.
గిద్దలూరు రూరల్: ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపుతప్పి కిందపడి తీవ్రగాయాలై వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని కె.ఎస్.పల్లె గ్రామ సమీపంలో జరిగింది. కె.బయనపల్లె గ్రామానికి చెందిన పాములేటి (39) అనే వ్యక్తి తన బైక్‌పై పెద్దచెరువు గ్రామానికి వెళ్లి తిరిగి వస్తూ శుక్రవారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తూ అదుపుతప్పి కిందపడిపోయాడు. నంద్యాల హైవేలో విధులు నిర్వర్తిస్తున్న హైవే పోలీసులు పాములేటిని 108 అంబులెన్స్‌లో గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాల తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

బీకే త్రషర్స్‌ను పరిశీలించిన బీమా కంపెనీ