కడలి వెంట కన్నీటి చూపులు | - | Sakshi
Sakshi News home page

కడలి వెంట కన్నీటి చూపులు

Oct 14 2025 6:53 AM | Updated on Oct 14 2025 6:53 AM

కడలి

కడలి వెంట కన్నీటి చూపులు

చీరాల: కడలి కెరటాలు ఆ కుటుంబాలలో కన్నీటిని మిగిల్చాయి. సరదాగా సేద తీరేందుకు చీరాల ఓడరేవు తీరానికి వచ్చి సముద్రస్నానం చేస్తుండగా అలల తాకిడికి గల్లంతైన ఐదుగురు విద్యార్థులలో ఆదివారమే ముగ్గురు మృతదేహాలు లభ్యమవగా, సోమవారం మరో విద్యార్థి మృతదేహం తీరానికి చేరింది. దీంతో బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అమరావతిలోని విట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఎంటెక్‌ చదువుతున్న ఏడుగురు స్నేహితులు ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా గడిపేందుకు చీరాల ఓడరేవు సముద్రతీరానికి వచ్చి గల్లంతైన విషయం విధితమే. స్థానిక మత్య్సకారులు గమనించి నలుగురు విద్యార్థులను బయటకు తీసుకురాగా, సాయి మణిదీప్‌ (జడ్చర్ల), జీవన్‌ సాత్విక్‌ (హైదరాబాద్‌), శ్రీసాకేత్‌ (హైదరాబాద్‌) గల్లంతయ్యారు. కొంత సమయం తర్వాత ముగ్గురి మృతదేహాలు తీరానికి చేరాయి.

భోరుమన్న గౌతమ్‌ కుటుంబ సభ్యులు...

మరో ఘటనలో వేటపాలెం మండలం వడ్డె సంఘానికి చెందిన ఇద్దరు విద్యార్థులు కూడా ఆదివారం గల్లంతయ్యారు. రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా వీరి ఆచూకీ లభించలేదు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్‌ స్వయంగా వాడరేవు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మైరెన్‌, గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం కుటుంబ సభ్యులు రాత్రంతా తీరం వద్దనే వేచి ఉన్నారు. సోమవారం ఉదయం తీరానికి గౌతమ్‌ కృష్ణప్రసాద్‌ మృతదేహం వచ్చింది. దీంతో అతని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి...

ఆదివారం లభ్యమైన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు, సోమవారం తీరానికి చేరిన మరో విద్యార్థికి మృతదేహానికి చీరాల ఏరియా వైద్యశాలలో సోమవారం పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. విద్యార్థులు గల్లంతైన సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు హుటాహుటిన చీరాల వచ్చి ఏరియా వైద్యశాలలోని మార్చురీలో ఉన్న మృతదేహాలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. పెద్ద చదువులు చదువుకుని ఆసరాగా నిలుస్తారని అనుకుంటే అందరినీ వదిలి వెళ్లిపోయారా అంటూ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు కంటతడి పెట్టించాయి. ఐదో విద్యార్థి షారోన్‌ ఆచూకీ లభించకపోవడంతో బాపట్ల జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్‌, ఆర్డీఓ చంద్రశేఖర్‌నాయుడు, చీరాల డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

చీరాల ఓడరేవు తీరానికి వచ్చిన గౌతమ్‌ మృతదేహం

విద్యార్థుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

జాడలేని షారోన్‌

తీరంలో గాలింపు చర్యల కొనసాగింపు

కడలి వెంట కన్నీటి చూపులు 1
1/1

కడలి వెంట కన్నీటి చూపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement