నాణ్యం పేరుతో కల్తీ మద్యం | - | Sakshi
Sakshi News home page

నాణ్యం పేరుతో కల్తీ మద్యం

Oct 14 2025 6:57 AM | Updated on Oct 14 2025 6:57 AM

నాణ్యం పేరుతో కల్తీ మద్యం

నాణ్యం పేరుతో కల్తీ మద్యం

ఊరూరా నారావారి కల్తీ బుడ్డి కూటమి నాయకుల జేబులు నింపడమే లక్ష్యంగా మద్యం వ్యాపారం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ ధ్వజం

యర్రగొండపాలెం: కల్తీ మద్యం సరఫరా చేసే ఆలోచన మనస్సులో పెట్టుకొని నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పిన ఏకై క నాయకుడు చంద్రబాబు అని ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ విమర్శించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కూటమి ప్రభుత్వ మద్యం విధానాలకు వ్యతిరేకంగా సోమవారం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి, ఎకై ్సజ్‌ సర్కిల్‌ కార్యాలయంలో మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు రాజకీయ చరిత్రలో కనీసం నాణ్యమైన మంచి నీళ్లు ఇచ్చిన చరిత్ర లేదని ఆయన విమర్శించారు. బాబు మాటలు నమ్మిన మద్యం ప్రియుల నోట్లో మట్టి కొడుతున్నాడని, రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం సరఫరా చేసి వారి ప్రాణాలను హరిస్తున్నాడని విమర్శించారు. కూటమి నాయకులు దోపిడీనే లక్ష్యంగా చేసుకొని అడ్డగోలుగా దోచుకోమని వాళ్ల ఎమ్మెల్యేలకు, నాయకులకు ఈ వ్యాపారాన్ని అప్పచెప్పాడని, సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్లకు సినిమాలు అప్పచెప్పినట్లు మద్యం వ్యాపారాన్ని దళారులకు అప్పచెప్పాడని అన్నారు. శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర, విశాఖపట్నం అయ్యనపాత్రుడి పక్కనే ఉన్న నాయకుడికి, బనగానిపల్లెలో ఆ నియోజకవర్గ ఇన్‌చార్జికి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఇంకొక నాయకుడికి, కృష్ణ, గుంటూరును అక్కడ ఉన్న ఒకరికి ఇస్తే ఇబ్రహీంపట్నంలో పట్టుబడ్డాడని, రాష్ట్రంలో ప్రతి చోట కల్తీ మద్యం ఏరులై పారుతోందని అన్నారు. జగనన్న పాలనలో ఒక్క బెల్ట్‌ షాపు ఉండేదికాదని, ఆయన పాలనలో రాష్ట్రంలో ఉన్న 40 వేల బెల్ట్‌ షాపులు తీసివేయిస్తే అప్పట్లో మద్యం అమ్మకాలు తగ్గాయని, అర్ధరాత్రి మద్యం సీసా దొరికేది కాదని అన్నారు. ప్రతి చోట పిప్పరమెంట్‌ దొరకదేమో కానీ నారావారి కల్తీ బుడ్డి దొరుకుతుందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ కాలంలో ప్రతి సంవత్సరం 10 శాతం మద్యం అమ్మకాల్లో ఆదాయం వచ్చేదని, మద్యం అమ్మకాలు తగ్గాయని, ఆదాయం పెరిగేదని, ఈ రోజు అమ్మకాలు విపరీతంగా పెరిగాయని, ఆదాయం మాంత్రం 3 శాతానికి పడిపోయిందని అన్నారు. 10 శాతం నుంచి 3 శాతానికి ఆదాయం పడిపోయిందంటే మిగిలిన ఆ డబ్బు కూటమి ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళ్తోందని అన్నారు. ఊరూరా వెలిసిన ఈ సారా కొట్లను ధ్వంసం చేయాల్సిన అవసరం ఉందని, తక్షణమే ఎకై ్సజ్‌ శాఖవారు జోక్యం చేసుకొని వీటిని అదుపు చేయకపోతే మహిళలే ఆ షాపులపై తిరగబడతారని హెచ్చరించారు. 30 వేల మంది కల్తీమద్యం బారినపడి చనిపోయారని సిగ్గులేకుండా టీడీపీ నాయకులు చెప్పారని, చనిపోయిన వారిపేర్లు ఈ నాటివరకు చెప్పడంలేదని, కల్తీమద్యంతో పట్టుబడిన టీడీపీ నాయకులే ఆ వ్యాపారాన్ని చేస్తూ గతంలో వ్యాపారం జరిగిందని ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు నీతిమాలిన రాజకీయాన్ని ఆపాలని, మద్యం, వ్యవసాయం, మట్టి, ఇసుక, గనులను ప్రైవేటు వారికి అమ్మేస్తున్నాడని, ఈ రోజు గ్రానైట్‌ ఇండస్ట్రీ పనిచేయడం లేదని, ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి సీనరేజ్‌లు వసూలు చేస్తున్నారని అన్నారు. జిల్లాకు వచ్చిన మెడికల్‌ కాలేజీని తమకు అనుకూలమైన ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశాడని, ఇటువంటి ఒంటెత్తు పోకడలు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే మరో నేపాల్‌ మాదిరి గా ఆంధ్ర రాష్ట్ర మారుతుందని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement