
సెకండరీ గ్రేడ్ టీచర్లకు కౌన్సెలింగ్ పూర్తి
● సోమవారం నుంచి విధుల్లోకి..
కనిగిరి రూరల్: మెగా డీఎస్సీ ద్వారా ఎంపికై న సెకండరీ గ్రేడ్ టీచర్లకు కౌన్సెలింగ్ పూర్తయినట్లు డీఈఓ కిరణ్‌కుమార్ తెలిపారు. స్థానిక ఆల్ఫా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ కిరణ్‌కుమార్ కౌన్సెలింగ్ నిర్వహించి వారికి స్థానాలు కేటాయించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ జిల్లాలో 124 మంది సెకండరీ గ్రేడ్ తెలుగు, ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై నట్లు తెలిపారు. వారికి ఈ నెల 3వ తేదీ నుంచి రెసిడెన్షియల్ తరహాలో శిక్షణ ఇచ్చామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శిక్షణ కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహించి ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. సోమవారం నుంచి వారంతా కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరాల్సి ఉంటుందన్నారు. కౌన్సెలింగ్‌లో మండల విద్యాశాఖ అధికారులు యూవీ నారాయణరెడ్డి, జి.సంజీవి, రాజాల కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.