రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

Oct 10 2025 6:18 AM | Updated on Oct 10 2025 6:18 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు స్పా సెంటర్లలో తనిఖీలు కత్తితో దాడిచేసి ఆటో తీసుకొని పరార్‌ సమస్యలు పరిష్కారానికి పోరాటాలే మార్గం

దర్శి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సాయినగర్‌ సమీపంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..గంగదేవిపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జునరావు, పద్మజలు బైక్‌పై వెళుతుండగా కుక్క అడ్డు రావడంతో అందుతప్పి కిందపడి గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలుకు తరలించారు.

ఒంగోలు టౌన్‌: నగరంలోని స్పా సెంటర్లలో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నగరంలోని సీఐలు, ఎస్సైలతో కూడిన 9 బృందాలు నగరంలోని 9 స్పా సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్పా సెంటర్ల నిర్వహణకు సంబంధించిన లైసెన్సులు, అనుమతులు, స్పా సెంటర్లలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను పరిశీలించారు. స్పా సెంటర్లలోని సీసీ కెమెరాలు ఏర్పాటు, వాటి పనితీరు, అంతర్గత నిర్మాణ శైలి వంటివాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ వి.హర్ష వర్థన్‌ రాజు మాట్లాడుతూ...స్పా, మసాజ్‌ సెంటర్ల పేరుతో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినా, అసాంఘిక కార్యకలాపాలకు నిర్వహించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత ఉజ్వల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. తనిఖీల్లో ఒన్‌టౌన్‌ సీఐ నాగరాజు, సబ్‌ డివిజన్‌ ఎస్సైలు నాగమల్లేశ్వరరావు, సుధాకర్‌, పున్నారావు, అజయ్‌బాబు, వెంకటసైదులు, నాగేంద్ర కుమార్‌, ఫణిభూషన్‌ పాల్గొన్నారు.

దొనకొండ: బాడుగకు ఆటో మాట్లాడుకుని డ్రైవర్‌పై కత్తితో దాడి చేసి ఆటోను తీసుకుని గుర్తు తెలియని వ్యక్తి పరారయ్యాడు. ఈ సంఘటన గురువారం సాయంత్రం మండలంలోని మల్లంపేట సమీపంలో జరిగింది. ఎస్సై టి.త్యాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కాపురానికి చెందిన నాగరాజు ఆటోను దొనకొండకు గుర్తు తెలియని వ్యక్తి రూ.600 కిరాయికి మాట్లాడుకున్నాడు. మార్కాపురం నుంచి మల్లంపేట మీదుగా దొనకొండకు బయల్దేరారు. ఆటో మల్లంపేట గ్రామం దాటిన వెంటనే ఆటోలో కూర్చున్న గుర్తు తెలియని వ్యక్తి డ్రైవర్‌ నాగరాజుపై కత్తితో దాడి చేసి కింద పడేసి ఆటో తీసుకుని పరారయ్యారు. గాయపడిన నాగరాజు సమీపంలోని మల్లంపేటకు చేరుకుని గ్రామస్తుల సహకారంతో చికిత్స నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాడు. నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు. సమాచారం తెలుసుకున్న దర్శి డీఎస్పీ బి.లక్ష్మీనారాయణ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. నిందుతుడి కోసం గాలింపు వేగవంతం చేయాలని పోలీస్‌ సిబ్బందికి ఆయన సూచించారు.

మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు

దర్శి: ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలే మార్గమని మాజీ శాసనమండలి సభ్యుడు కేఎస్‌ లక్ష్మణరావు అన్నారు. సీఐటీయూ, యూటీఎఫ్‌, జనవిజ్ఞాన వేదికల అధ్వర్యంలో తాండవ రంగారావు అధ్యక్షతన తాలూకా క్లబ్‌ సమావేశం హాలులో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ అంగన్‌వాడీలు 42 రోజులు సమ్మె చేసినప్పుడు వేతనాలు పెంచుతామని ఇచ్చిన వాగ్దానం నేటికీ అమలు కాలేదన్నారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని, 6 డీఏలు ఇవ్వాల్సి ఉన్నా ప్రకటించడం లేదని, అందుకోసం పోరాటాలు తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. ముందుగా ప్రపంచ విప్లవకారుడు చేగువేరా వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి, యూటీఎఫ్‌, జేవీవీ నాయకులు మీనిగ శ్రీనివాసరావు, రాజశేఖర్‌, ఫాతిమా, తిరుపతమ్మ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో  ఇద్దరికి తీవ్ర గాయాలు 
1
1/2

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో  ఇద్దరికి తీవ్ర గాయాలు 
2
2/2

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement