
‘ఛలో మెడికల్ కాలేజ్’ విజయవంతం చేయండి
● ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం మార్కాపురంలో జరిగే ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ కోరారు. అన్ని వర్గాలకు చెందిన పేద విద్యార్థులు డాక్టర్లుగా ఎదగాలని, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగనన్న నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేసిందన్నారు. ఈ క్రమంలో మార్కాపురంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల వద్ద శాంతియుతంగా నిరసన తెలిపి తమ గళాన్ని దగాకోరు కూటమి ప్రభుత్వానికి వినిపించి, వారి దోపిడీని అడ్డుకుందామని ఆయన విద్యార్థి, యువజన విభాగాలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉదయం 9 గంటలకు దేవరాజుగట్టువద్దకు చేరుకోవాలని, అక్కడి నుంచి మార్కాపురానికి బయలుదేరి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్నారు.
పామూరు: మండలంలోని మాలకొండాపురం రెవెన్యూలో నిమ్జ్ ప్రతిపాదిత భూములను గురువారం జేసీ ఆర్ గోపాలకృష్ణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏపీఐఐసీ ప్రతిపాదనల మేరకు పరిశ్రమల ఏర్పాటుకు 856 ఎకరాల రెవెన్యూ రికార్డులు పరిశీలించారు. కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్‌రెడ్డిని అడిగి భూముల వివరాలు తెలుసుకున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు నీటివసతి, రోడ్ కనెక్టివిటీ అంశాలపై అధికారులతో చర్చించారు. ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ పి.మదన్‌మోహన్, తహసీల్దార్ ఆర్.వాసుదేవరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: సురక్షితమైన మందుల వాడకంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్‌కుమార్ సూచించారు. జాతీయ ఫార్మసీ వారోత్సవాల్లో భాగంగా గురువారం ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనవసరమైన ఔషధాలను వినియోగించడం సాధ్యమైనంత మేర తగ్గించుకోవాలని సూచించారు. వైద్యుడి సలహా లేకుండా ఎలాంటి ఔషధాలు వినియోగించరాదన్నారు. జీజీహెచ్‌కు వచ్చే రోగులకు మందుల వాడకంపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ తిరుపతిరెడ్డి, ఫార్మకాలజీ హెచ్‌ఓడీ చంద్రకళ, ఆర్థోపెడిక్ హెచ్‌ఓడీ అజయ్, క్విస్ కాలేజీ ఆఫ్ ఫార్మశీ విద్యార్థులు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: జిల్లాలో మిగిలిపోయిన నాలుగు బార్లకుగాను గురువారం ఒక బార్‌కు డ్రా తీశారు. కలెక్టర్ కార్యాలయంలో డీఆర్‌ఓ చినఓబులేసు డ్రా తీసి లైసెన్స్ కేటాయించారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని ఓపెన్ కేటగిరి బార్‌కు నిబంధనల ప్రకారం నలుగురు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, వారి సమక్షంలో డ్రా తీసినట్లు ఈఎస్ షేక్ ఆయేషా బేగం తెలిపారు.

‘ఛలో మెడికల్ కాలేజ్’ విజయవంతం చేయండి

‘ఛలో మెడికల్ కాలేజ్’ విజయవంతం చేయండి