
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
● ఒంగోలు విద్యుత్ భవన్ ముందు పవర్ జేఏసీ నాయకుల ధర్నా
ఒంగోలు సబర్బన్: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏపీ పవర్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని రాంనగర్‌లో ఉన్న విద్యుత్ భవన్ ముందు గురువారం భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ రీజనల్ సెక్రటరీ ఓ.బాలాజీ మాట్లాడుతూ కార్మికుల, ఉద్యోగులు ప్రధాన సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులందరినీ సంస్థలో విలీనం చేయాలని, పెండింగ్‌లో ఉన్న కార్మికుల ఆరియర్స్ ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఏ.సాయికుమార్, ఒంగోలు డివిజినల్ ప్రెసిడెంట్ విష్ణు మహేశ్వర వర్ధన్, రఫీ, రమణ రెడ్డి, హైమావతి పాల్గొన్నారు.